Ram & Lakshman : ఫైట్ మాస్టర్లుగా తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు ఉన్న అన్నదమ్ములు రామ్ మరియు లక్ష్మణ్. ఇద్దరూ కవలలు కావడం విశేషం. ఇద్దరూ కలిసి ఫైట్ మాస్టర్స్ గా సినిమాల్లో కలిసి పనిచేస్తారు. ఇప్పటి వరకు దాదాపుగా ఇద్దరూ కలిసి 300 పైగా సినిమాలకు ఫైట్ కంపోజ్ చేసారు. అయితే మొదట వీరికి గుర్తింపు ఇచ్చింది మాత్రం పూరి జగన్నాథ్. ఇడియట్ సినిమాకు ఫైట్ మాస్టర్స్ గా వీళ్లకు అవకాశం ఇచ్చారు పూరి. ఆ సినిమాతో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ మాస్టర్, వీళ్ళు ఒకే కాంపౌండ్ నుండి వచ్చారు. ఒకోసారి వీరికి రావాల్సిన సినిమా అవకాశలు విజయ్ మాస్టర్ కి కొన్ని విజయ్ మాస్టర్ అవకాశలు వీరికి వచ్చాయి. అయితే వీరి కెరీర్ మొదలయ్యే సమయానికి విజయ్ గారు టాప్ హీరోస్ కి ఫైట్ మాస్టర్ అయ్యారు.

పూరి తో అందుకే చేయలేకపోయాము…
మొదట మమ్మల్ని నమ్మి మాకు ఆఫర్ ఇచ్చింది పూరీ జగన్నాథ్ గారే అయితే జగన్ పెద్ద హీలతో సినిమాలు చేస్తున్న సమయంలో మేము ఇంకా చిన్న హీరోలకు చేస్తున్నాము అందుకే హీరోల ఛాయిస్ వల్ల మమ్మల్ని పెట్టుకోలేదు. అంతే కానీ మా మధ్య ఏమీ గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. పోకిరి సమయంలో, ఆంధ్రవాలా సమయంలో హీరోల ఛాయిస్ వల్ల మేము పూరీ తో పని చేయలేదు అంటూ చెప్పారు. ఇక శ్రీహరి గారితో విజయ్ మాస్టర్ ఎక్కువ సినిమాలు చేసారు. ఆయనకు పెద్ద హీరోలతో ఆఫర్స్ వచ్చినపుడు మేము శ్రీహరిగారి సినిమాలకు పనిచేసాము అంటూ చెప్పారు. ఇక జీవితంలో బాగా ఇబ్బంది పడి, బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

రవితేజ సినిమాలకు ఎక్కువగా పనిచేసాము అయితే మధ్యలో మేమే ఒకే మూసలో పని ఉంటుంది అలా వద్దు కొన్ని సినిమాలకు వేరేవాళ్ళతో పని చేద్దామని మేమే బ్రేక్ ఇచ్చాము. ఇక రవితేజ వెంకీ సినిమా సమయంలో డైరెక్టర్ శీను వైట్ల ను కలవమని రవితేజ చెబితే ఆఫీస్ కి వెళ్ళాము, అయితే నిర్మాత కూడా శీను వైట్ల దే ఫైనల్ డెసిషన్ అన్నారు. ఇక రెండు గంటలు వెయిట్ చేసాక కలవకుండా వెళ్లిపోయారు. మొదటి సారి అంతసేపు వెయిట్ చేసాము. ఇక ఒక పెద్ద హీరో సినిమా సమయంలో మొదట మాతో పని చేయించుకుని ఆ తరువాత బాగోలేదని వేరే మాస్టర్ ని పెట్టుకున్నారు అప్పుడు కొంచెం బాధేసింది. ఇప్పటివరకు ఏడు సార్లు బెస్ట్ ఫైట్ మాస్టర్స్ గా నంది అవార్డు అందుకున్నారు ఈ ఫైట్ మాస్టర్లు.































