Ram Prasad : జబర్దస్త్ లో ఫ్రెండ్ షిప్ అంటే గుర్తొచ్చేది సుధీర్ టీం లోని రామ్ ప్రసాద్, గెటప్ శీను, సుధీర్ ల స్నేహం. వీళ్ళ ముగ్గురు జబర్దస్త్ ద్వారా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక స్కిట్లో కూడా వీళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. అయితే ఇపుడు జబర్దస్త్ లో పూర్వ వైభవం లేదు. అందరూ కొత్తవాళ్ళు వస్తున్నారు. పాత వాళ్ళు వెళ్లిపోతున్నారు. జడ్జస్ గా ఉన్న నాగబాబు, రోజా కూడా వారి వ్యక్తిగత కారణాల రీత్యా వెళ్లిపోయారు.

టీఆర్పి కోసం ఏడ్చలేదు…. ఒంటరివాడిని అయ్యాను….
ఇక టాప్ కమెడియన్స్ అయిన సుధీర్, శీను, ఆది కూడా జబర్దస్త్ వీడారు. సుధీర్, శీను జబర్దస్త్ వదిలి వెళ్ళిపోడానికి చాలానే కారణాలు నెట్టింట్లో వినిపిస్తున్నా అసలు ఎందుకు వెళ్లిపోయారనే క్లారిటీ వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇక సుధీర్, శీను వెళ్లిపోయారు సినిమాలలో బిజీ అయిపోయారు. ఇక రామ్ ప్రసాద్ జబర్దస్త్ లో ఒంటరి వాడయ్యాడు. ఇక సుధీర్, శీను, రామ్ ప్రసాద్ ల స్నేహాన్ని, కెవ్వు కార్తీక్, రాకేష్ లు తమ స్కిట్స్ ద్వారా చూపించారు. ఇక ఒక్కసారిగా అందరు ఎమోషనల్ అయ్యారు. జడ్జి ఇంద్రజ కూడా దిష్టి తగిలిందేమో మీ స్నేహానికి అంటూ ఎమోషనల్ అయ్యారు.

రామ ప్రసాద్ కూడా ఎమోషనల్ అయి ఏడ్చేసాడు బాగా, అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంతమంది టీఆర్పి కోసం రామ ప్రసాద్ ఇలా ఏడ్చాడంటూ కామెంట్స్ రావడంతో రామ్ ప్రసాద్ స్పందించాడు. నిజంగానే వాళ్ళు లేక ఒంటరి అయిపోయానని అందుకే ఏడుపు వచ్చిందని, టీఆర్పి కోసం ఇదంతా చేయలేదని చెప్పాడు. చివరిదాకా ముగ్గురం కలిసి ఉంటామని అనుకున్నాను కానీ ఎలా వీడిపోవాల్సి వస్తుందని అనుకోలేదని చెప్పాడు.



























