Ramarao On Duty : రవితేజ, వేణు తోట్టెంపూడి కలిసి మొదటి సారి నటించిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ సినిమా 29 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా దర్శకుడు శరత్ మండవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. అటు రవితేజ, ఇటు వేణు తోట్టెంపూడి ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక రవితేజను వేణు తో వర్క్ చేయడం గురించి అడుగగా నాకన్నా ముందు స్టార్ హీరో తను, నేను ఇంకా కెరీర్ లో స్ట్రగలవుతున్న సమయంలోనే తాను స్టార్ హీరో అంటూ చెప్పారు.

స్వయంవరం సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది…
వేణు తోట్టెంపూడి మొదటి సినిమా ‘స్వయంవరం’ సినిమాలో బ్రాహ్మజీ చేసిన పాత్ర అవకాశం మొదట నాకే వచ్చినా అనుకోని కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చిందని రవితేజ చెప్పాడు. ఇక హనుమాన్ జంక్షన్ సినిమా టైములో షూటింగ్ కి వెళ్లాను కానీ వేణు ని కలిసి మాట్లాడేంత రేంజ్ నాది అప్పుడు కాదు, అతను అప్పటికే స్టార్ హీరో, నేను ఇంకా కెరీర్ లో నీలదొక్కుకోడానికి కష్టపడుతూ ఉన్నాను అంటూ రవితేజ చెప్పారు. ఇక వేణు తోట్టెంపూడి ని చాలా గ్యాప్ తరువాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చినపుడు టెన్షన్ పడ్డారా అని అడుగగా షాట్ ఎలా వస్తోందో అన్న టెన్షన్ తప్ప నటించడానికి ఏం టెన్షన్ లేదని చెప్పాడు.

ఇక ఇద్దరూ కలిసి నటించినపుడు ఎలా అనిపించింది ఇబ్బంది ఏమైనా పడ్డారా అని అడుగగా అలాంటిదేమి లేదు రవి చాలా ఫ్రీ గా ఉండటం వల్ల నాకు ఇబ్బంది కలగలేదు అంటూ వేణు చెప్పాడు. ఇక సినిమా లో నా పాత్ర కొత్తగా ఉండి ప్రేక్షకులకు నచ్చుతుందని రవితేజ చెప్పారు. ఇక వేణు మాట్లాడుతూ రవి సినిమాలో విక్రమార్కుడు బాగా నచ్చుతుందని, ఇక వెంకీ సినిమాలో ట్రైన్ సన్నివేశం బాగా ఇష్టమని చెప్పారు.



























