General News

కేరళలో మరో వైరస్ కలకలం.. ఆ పండు తినడం వల్లనే ఆ వైరస్ సోకుతుందా..?

Published

on

కేరళలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కరోనాతో ఇప్పటికే విలవిలలాడిన జనాలకు ఈ వైరస్ తో ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆగస్టు 27 న కోజికోడ్ లోని చాత్తమంగళం పంచాయతీ పరిధిలోని ఓ 12 ఏళ్ల బాలుకి జ్వరం వచ్చింది. వాళ్లు మామూలు జ్వరం అనుకొని వారికి దగ్గరల్లో ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లారు.

కానీ ఆ బాలుడికి జ్వరం తగ్గలేదు. తర్వాత వాళ్లు అక్కడ నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి చికిత్స ఇస్తున్నప్పటికీ జ్వరం మాత్రం తగ్గలేదు. చివరకు మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడిని నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో.. ఆదివారం ఉదయం కన్నుమూశాడు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ మరింతగా అప్రమత్తమైంది. వెంటనే వైద్య బృందంతో అతడు ఉంటున్న పరిసరాల్లోకి వెళ్లి పరిశీలించారు.

అతడి తల్లిదండ్రులు మాత్రం.. తన కుమారుడు రంబుటాన్ పండ్లను తినడం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. దీంతో వైద్యబృంద సభ్యులు బాలుడి ఇంటికి సమీప ప్రాంతాల్లో ఉన్న రంబుటాన్ పండ్లను నమునాలను సేకరించింది. తర్వాత అతడికి దగ్గరి కాంటాక్ట్ ఉన్న 8 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.

Advertisement

అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌లుగా మొత్తం 251 మందిని వైద్య అధికారులు గుర్తించారు. వారిని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. చాత్తమంగళం పంచాయతీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను నిర్భదంతో ఉంచి.. పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తున్నారు అధికారులు. ఎప్పటికిప్పుడు ఆ బాలుడి కాంట్రాక్ట్ ట్రేసింగ్ లను గుర్తించే పనిలో ఉన్నామని.. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Advertisement

Trending

Exit mobile version