Ramesh Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని కుటుంబాలదే ముఖ్య పాత్ర అని చెప్పుకోవచ్చు. వాటిలో ఘట్టమనేని కుటుంబం కూడా ఒక్కటి. ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమాలలో చెరగని ముద్ర వేశారు. కృష్ణ ఇందిరా దేవీలకు అయిదుగురు సంతానం కాగా అందులో రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా పరిచయం అయ్యారు. కృష్ణ ఇందిరా దేవీ ల పెద్ద సంతానం రమేష్ బాబు. ఈయన ఈ ఏడాది ప్రారంభంలోనే మరణించిన సంగతి తెలిసిందే.

రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు మాత్రమే చేసారు. కాకపోతే ఆ సినిమాలు ఆయనను హీరోగా ఎక్కువ రోజులు నిలబెట్టలేక పోయాయి. అయితే ఆయన తరువాత నిర్మాతగా పలు చిత్రాలు తీసారు. మహేష్ బాబు హీరోగా కొన్ని చిత్రాలు నిర్మించిగా అవి కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. తరువాత రమేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

రమేష్ బాబు కుటుంబం…..

రమేష్ బాబు కుటుంబం గరించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. వీరు ఎపుడు మీడియా ముందుకు రాలేదు. ఇక రమేష్ బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా భార్య పేరు మృదుల. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. వీరు ఘట్టమనేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా పెద్దగా కనిపించరు. అయితే తాజాగా రమేష్ బాబు మరణం తరువాత జరిగిన ఒక ఫంక్షన్ లో రమేష్ బాబు భార్య మృదుల ఆయన కుమారుడు జయకృష్ణ కెమెరా కు చిక్కారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.






























