Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి ఉండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక నచ్చినా నచ్చకపోయినా సినిమా విషయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారట రమేష్ రెడ్డి గారు, దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు. ఇక ఇండస్ట్రీ లో శ్రమ దోపిడీ, రైటర్ కి వచ్చే పారితోషకాల గురించి మాట్లాడారు.

గబ్బర్ సింగ్ లో ఆ డైలాగు అలానే పుట్టింది…
ఇండస్ట్రీ లో శ్రమ దోపిడీ గురించి మాట్లాడుతూ ఎక్కువగా శ్రమ దోపిడీ రచయితలే ఎదుర్కొంటున్నారు అంటూ చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీ లో అలా శ్రమ దోపిడీ ఉంది అనుకుంటే పని చేయలేమని ఒక డైరెక్టర్ తో పని చేస్తున్నపుడు మాకిచ్చే డబ్బులకంటే ఎక్కువ పని చేయించుకుంటున్నాడు అని అనుకుంటే పని చేయలేమని చెప్పారు. అవకాశాలు కూడా రావని చెప్పారు రమేష్ రెడ్డి.

ఇక గబ్బర్ సింగ్ లో ‘నాక్కోంచెం తిక్కుంది’ డైలాగు ముందు సన్నివేశం రాసుకున్నపుడు లేదంటు అసలు కథ చెప్పారు. షూటింగ్ పొల్లాచ్చి కేరళ లో జరుగుతున్నపుడు పవన్ కళ్యాణ్ ఎందుకో బాగా డల్ గా ఉన్నారు. ఆ సమయంలో షాట్ రెడీ అయింది రమ్మని పిలిచే ధైర్యం వారికి రాలేదు. ఒకవైపు మధ్యాహ్నం కావొస్తోంది ఇంకా సీన్ కాలేదని బండ్ల గణేష్ టెన్షన్ పడుతుంటే హరీష్ వెళ్లి ఆ ఒక కొత్త డైలాగు అనుకున్నాను అంటూ ఆ డైలాగు చెప్పి పవన్ గారికి కొత్త జోష్ నిచ్చాడు. ఎప్పుడు ఆ డైలాగు అనుకున్నాడో కూడా తెలియదు హరీష్ కానీ హీరోలకు మంచి జోష్ ఇస్తాడు అంటూ డైలాగు కి ఉన్న కథ చెప్పారు రమేష్ రెడ్డి.

































