Ramya Krishna : తొంభై లలో అగ్రహీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అత్త పాత్రల్తో మెప్పించింది. ఇక ‘బాహుబలి’ సినిమా ఆమె కెరీర్ ను మరో మలుపు తిప్పింది. శివగామి దేవిగా ఆమె ఆహర్యం, నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా తరువాత రమ్య కృష్ణ కీలకంగా ఉండే పాత్రలనే ఎంచుకుంటూ అడుగులు వేస్తోంది. ఇక ఈ మధ్యనే లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ కు తల్లిగా నటించి మెప్పించింది. ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రమ్య కృష్ణ తెలుగులో ఒక డాన్సింగ్ షో కి జడ్జి గా రాబోతోంది.

ఆహా లో ‘డాన్సింగ్ ఐకన్’ కి జడ్జి…
ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇప్పటికే సింగింగ్ ఐడల్ మొదటి సీజన్ ను పూర్తి చేసారు. ఇక ఇప్పుడు మరో సరికొత్త షోకి శ్రీకారం చుట్టారు. అదే డాన్సింగ్ ఐకాన్. రియాలిటీ షో అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఓంకార్. ఇప్పటికే ఎన్నో రియాలిటీ షోలను వివిధ ఛానెల్స్ లో చేసిన ఓంకార్ అవి కాకుండా జీనియస్, రాజు గారి గది, రాజు గారి గది 2 వంటి సినిమాలకు కూడా డైరెక్షన్ చేసారు. ఇక ఇప్పుడు ఆహా ఒరిజినల్స్ లో డాన్సింగ్ ఐకాన్ అనే డాన్స్ షో తో అలరించనున్నాడు. ఇందులో జడ్జిలుగా శేఖర్ మాస్టర్, రమ్య కృష్ణ వ్యవహారిస్తారు. ఇక 11 మంది కాంటెస్టంట్లు పాల్గొనే ఈ షోలో మూడు టీంలుగా ఉంటారు శ్రీ ముఖి, మోనాల్ గజ్జర్, యష్ మాస్టర్ వీరికి లీడర్లుగా ఉంటారు.

Mamulga undadhu mari!
— ahavideoin (@ahavideoIN) September 4, 2022
Extra energetic performances & mundhu eppudu lenantha extra entertainment tho, mee kosam oka GRAND Gala Episode!
Don't miss #DanceIkonOnAHA
Grand Gala episode – Premieres September 11, 7 pm.
▶️ https://t.co/V7kKZ3JmvR@TheDeverakonda @ananyapandayy pic.twitter.com/eEH18iStmA
ఇక ఈ షోలో మరో విశేషం కాంటెస్టెంట్లను వేలం లో పెద్ద సినిమా బ్యానర్లు కొనుక్కోవడం. గీతాఆర్ట్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఇద్దరు కంటెస్టెంట్స్ చొప్పున వేలంలో తీసుకోనున్నారు. ఒక డాన్స్ లో కాంటెస్టెంట్స్ ని ఏకంగా పెద్ద బ్యానర్స్ కొనుక్కోవడం అంటే షో మామూలుగా ఉండదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక శనివారం, ఆదివారం ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమయ్యే ఈ షో విన్నర్ కి ఒక టాప్ హీరో సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం లభిస్తుంది. సెప్టెంబర్ 11 నుండి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షో వస్తుంది. బిగ్ బాస్ లో జస్ట్ అలా సందడి చేసి ప్రేక్షకులను అలరించిన రమ్య కృష్ణ ఇపుడు డాన్సింగ్ షో కి జడ్జి గా ఎలా ఉంటారో వేచి చూడాలి.

































