Ramya Raghupathi : నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమాయణం సంగతి ఎపుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్. సీరియల్ లాగా సాగుతూనే ఉన్నా ఈ ఇష్యూ లో కొత్త ట్విస్ట్ వచ్చింది. అసలు నరేష్ ఎలాంటి వాడు అంటూ ఆయన భార్య రమ్య రఘుపతి మొదటి సారి మీడియా ముందుకువచ్చి మాట్లాడారు. తను ఇంకా తన భర్తతో విడాకులు తీసుకోలేదంటూ కోర్ట్ లో కేసు నడుస్తోందని తెలిపారు. అయితే ఇంతలో నరేష్ పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నాడానే వార్తలు వినిపిస్తున్నాయని అందుకే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇక కృష్ణ గారి అంత్యక్రియల సమయంలో జరిగిన సంఘటనమాలు చెబుతూ వీడియో ప్రూఫ్ లను చూపిస్తూ నరేష్ చేసిన పనులు అత్త విజయ నిర్మల క్షమించదంటూ ఫైర్ అయ్యారు.

రాత్రంతా శవం వద్ద ఎవరు లేరు…
కృష్ణ గారు మరణించిన రోజు రాత్రి ఇంటి వద్దే ఆయన శవం ఉంచి మరుసటి రోజు ఉదయం ఏరు గంటల ప్రాంతంలో పద్మాలయా పస్టూడియో కి తీసుకెళ్లారని రమ్య తెలిపారు. రాత్రంతా శవం వద్ద కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరు లేరని వాళ్ళందరూ పద్మాలయా కూ తీసుకెళ్లాడమా ఇక్కడ ఉంచడమా అనే కన్ఫ్యూషన్ లో ఉండగా నరేష్ అసలు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదని శవం ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయాడంటూ తెలిపారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం నుండి దాదాపు ఉదయం ఆరు గంటల వరకు శవం వద్ద కేవలం రమ్య రఘుపతి ఆమె కొడుకు రన్ వీర్ మాత్రమే శవజాగరం చేసారు.

ఇక కొంతమంది డ్రైవర్లు తప్ప ఎవరు లేరు. ఇక ఆయన నుదుటి మీద పెట్టడానికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి కుంకుమ ఒకాయన తెచ్చి నరేష్ కి ఇద్ధామనుకున్న కానీ నరేష్ ప్రవర్తన చూసి నచ్చక నీకు ఇస్తున్న పెట్టు అని ఇచ్చారంటు తెలిపారు. ఇక ఉదయం పద్మాలయా స్టూడియోస్ కూ కృష్ణ గారి పార్థివ దేహం తరలించినపుడు చాలా బాధగా అనిపించిందని ఎవరు లేకుండా ఇంటి నుండి ఒంటరిగా వెళ్లారని మా అత్తయ్య ఉన్నంత కాలం ఆయన బయటకు వెళ్లాలంటే గడప దగ్గరికి వచ్చి సాగనంపేదని ఖచ్చితంగా ఆ క్షణం విజయ నిర్మల గారి ఆత్మ బాధపడుంటుందంటూ నరేష్ చేసిన పనికి ఆమె బాధపడుంటారంటూ తెలిపారు.



























