Ramya Raghupathi : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటి జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరూ తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని అవి ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళు ప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచకీడ్చింది. కొంత కాలంగా ఈ ఇష్యూ సైలెంట్ గా ఉంది అనుకునేలోపే నరేష్ పవిత్ర లోకేష్ లిప్ లాక్ సీన్ తో వీడియో చేసి మరీ పెళ్లి అంటూ చెప్పారు. ఇక సీన్ లోకి మళ్ళీ నరేష్ మూడో భార్య ఎంటర్ అయింది. ఒక వైపు మాత్రమే అందరికీ తెలుసు, నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటూ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ విషయాలను తెలిపారు.

రెచ్చగొట్టాలని చాలా చేశారు…
రమ్య రఘుపతి నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి గురించి స్పందిస్తూ లిప్ లాక్ వీడియో గురించి ప్రస్తావించారు. ముద్దు పెట్టుకుంటూ ఉన్న ఆ వీడియో ఏదో సినిమాకు సంబంధిచిన ప్రమోషన్స్ లో భాగంగా చేసిందనే చెప్పుకుంటున్నారని తెలిపారు. ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా కోసం ఆ వీడియో చేసారంటూ నరేష్ సినిమా టైటిల్ మళ్ళీ పెళ్లి కాదు మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పెళ్లి అని పెట్టుకోవాలి, అదే సరిగ్గా సరిపోతుంది అంటూ ఏద్దేవా చేసారు.

ఇక వీరి వీడియో నన్నేమి బాధపడేలా చెయదని, నన్ను రెచ్చగొట్టాడానికి చాలా ప్రయత్నినించారని, కృష్ణ గారు మరణించినపుడు కూడా ఇలానే చాలా రెచ్చగొట్టాడానికి ప్రయత్నించారని తెలిపారు. కానీ నేను న్యాయం కోసం చివరి దాకా పోరాడుతానని చెప్పారు. అంతే కాకుండా పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తా అంటూ తెలిపారు. ఇలాంటి వీడియోలన్ని నా కొడుకు మీద ప్రభావం చూపుతాయని, వాళ్లిద్దరూ టీవీ లో కనిపించగానే గన్ పెడుతున్నాడని, చిన్నవయసులో వాడి మీద ప్రభావం పడుతోందనే భయం ఉందని తెలిపారు.

































