Ramzan Festival : క్రమ శిక్షణ, ధాత్రుత్వం, ధార్మిక చింతన కలయిక రంజాన్… రంజాన్ నెలలో ముస్లింలు కఠినంగా ఉపవాసాలు చేయడానికి కారణం ఇదే…!

0
203

Ramzan Festival : మనం ఆకలితో ఉన్నపుడే పేదవాడి ఆకలి బాధ మనకు తెలుస్తుంది. ఉపవాసం చేసిన రోజే నోటికి కొత్తగా రుచి తెలుసోస్తుంది. బ్రతకడమంటే మనం మాత్రమే బ్రతకడం కాదు నలుగురినీ కలుపుకుని పోతూ జీవించడం, కష్టంలో కొందరికైనా సహాయం చేయడం. అలాంటి ఒక గొప్ప విలువలను మనకు చెప్పే పండుగ రంజాన్. రంజాన్ పండుగ ఏ రోజున జరుపుకుంటారు, ఎందుకని ఒక నెలంతా కఠోర ఉపవాసాలను ముస్లిం సోదరులు అనుసరిస్తారు, ఖురాన్ ఈ పండుగ గురించి ఏమి చెబుతోంది తెలుసుకుందామా…

క్రమశిక్షణ, ధాత్రుత్వం, ధార్మిక చింతన ఇదే రంజాన్ మూలం…

ముస్లింలు చంద్రమాన క్యాలెండరును ఫాలో అవుతారు. వారి చంద్రమాన క్యాలెండరు ప్రకారం తొమ్మిదో నెల రంజాన్ నెలగా భావిస్తారు. వారు పవిత్రంగా భావించే ఖురాన్ ఆ నెలలోనే ఆవిర్భవించడం ఇందుకు మరో కారణం. కఠోర ఉపవాసాలు, రోజుకు ఐదు సార్లు నమాజ్ చదవడం అలాగే పవిత్ర ఖురాన్ పఠనం అంటూ సాగే ఈ నెలలో దానధర్మాలను చేస్తూ ఆ అల్లాను ప్రార్థించడం చేస్తారు మహమ్మదీయులు. మహ్మద్‌ ప్రవక్త “లా ఇల్లాహ ఇల్లల్లా” అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నెలలో సూర్యోద్యం నుండి మళ్ళీ చంద్రుడిన చూసే వరకు ఉమ్ము కూడా మింగకుండా కఠోర ఉపవాసం ఉంటారు ముస్లింలు. చంద్రుడిన చూసాక ఖార్జూరం తిని దీక్ష విరామిస్తారు. ఇది నేటి యువత ఫాలో అయ్యే ఇంటర్మిటన్ డైట్ ను పోలి ఉంటుంది.

కఠోర ఉపవాస దీక్ష చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది అలాగే నెల రోజుల ఉపవాసం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి హలీం వంటి ప్రోటీన్స్ ఆహారం తీసుకోవడం వల్ల శక్తి ఏర్పడుతుంది. అలాగే ఈ నెలలో పేదలకు దానధర్మాలను చేయాలని ఖురాన్ సూచిస్తుంది. పండుగ నాడు పేదలు కూడా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది పవిత్ర ఖురాన్. ఇక ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, ఈ నెలలో నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం. వయస్సు తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలను, చెడు వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్ష , రోజా అంటారు.. సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తుంది.