పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం భీమ్లా నాయక్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీనిలో రానా దగ్గుపాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని నుంచి వచ్చిన టీజర్, సాంగ్ మరియు రానా చెప్పే డైలాగ్ ఓ రేంజిలో పాపులర్ అయ్యాయి.

సినిమా ప్రమోషన్ కి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే రానా దగ్గుపాటి ఏ సినిమాలో అయినా.. ఏ పాత్ర ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమను షేక్ చేసిన బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడి పాత్రతో ఆయన నటన ప్రతీ ఒక్కరిని మెప్పించింది. దాంతోనే అతడి స్థాయి బాగా పెరిగిందనడంలో సందేహం లేదు.
అయితే భీమ్లా నాయక్ సినిమాకు రానా రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు అతడు 25 రోజులకు కాల్ షీట్స్ ఇచ్చారట. దానికి అతడు రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలితో రేంజ్ పెరిగిన తరుణంలో ఆ మాత్రం తీసుకునే స్థాయి రానాకు ఉందని ఫిల్మీ వర్గాల టాక్.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం రిమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాగర్ కె చంద్ర. దీనికి తమన్ సంగీతం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నిత్యా మీనన్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.





























