Rana Daggubati : మూవీ మొఘల్ రామానాయుడు గారి మనవడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రానా దగ్గుబాటి ఏ మాత్రం తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ప్రభావం లేకుండా సినిమాలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలతో మెప్పిస్తూ నటనలో తనని తాను తీర్చిదిద్ధుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ‘లీడర్’ సినిమాతో మొదలయిన రానా నేడు ‘బాహుబలి’ వంటి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. హీరోగా మొదలయి మధ్యలో పంథా మార్చుకుని విలన్ గా కూడా మెప్పించాడు. ఇక ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించాడు.

భార్య కోసం ఆ ప్రాజెక్ట్ వద్ధన్నుకున్నాడట…
ఇక తాజాగా రానా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో ప్రతినాయకుడిగా పవన్ కి ధీటుగా నటించాడు. చాలా మంది సినిమా పెద్దలు రానా నటన పవన్ కళ్యాణ్ కన్నా బాగుందంటూ ప్రశంసించారు. ఇక ‘విరాట పర్వం’ సినిమాలో కుడా రానా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే రానా కు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చినా దాన్ని సున్నితంగా వద్దనుకున్నాడట. దీనికి కారణం రానా భార్య మిహిక బజాజ్. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నారు ఈ జంట.

పెళ్లి తరువాత రానా సినిమాల్లో బిజీగా ఉండటవల్ల భార్యకు సమయం కేటాయించలేక పోతున్నారట. అందుకోసం ఇప్పుడు కొత్త సినిమాలేవి మొదలు పెట్టకుండా గ్యాప్ తీసుకుని భార్యతో సమయం గడపాలని అనుకుంటున్నాడట. అందుకే ఒక పెద్ద ప్రాజెక్ట్ నుండి వచ్చిన ఆఫర్ ను వదులుకున్నాడట. ఆ ప్రాజెక్ట్ కోసం 20 కోట్లు ఆఫర్ చేశారట కానీ రానా వదులుకోవడం తో ఫిల్మ్ నగర్ లో ఇది ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. భార్యకు సమయం కేటాయించాలి కానీ మరీ ఇంత భారీ మూల్యానికా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
































