Rao Gopal Rao : విలనిజంలో ప్రత్యేకమైన డైలాగులతో విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన వ్యక్తి రావు గోపాల్ రావు గారు. ఆయన డైలాగ్ డిక్షన్ నటన అన్నీ కొత్తగా ట్రెండ్ సెట్ చేసాయి. కాకినాడ వద్ద గంగనపల్లి లో జన్మించిన ఆయన ‘భక్త పోతన’ సినిమా ద్వారా మొదటి సారి తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. ఆయన విలనిజం అంత వరకూ ఒక ఎత్తు ‘ముత్యాల ముగ్గు’ సినిమా తో మరో ఎత్తు. ఆ సినిమాలో ఆయన డైలాగులకు ఉన్న బేస్ వేరు. ఇక ఆయన ‘ప్రేమ అండ్ కొ’ సినిమాలో చివరి సరిగా నటించారు. 1994 లో మధుమేహ వ్యాధి వల్ల మరణించిన ఆయన గురించి ఇప్పటితరానికి అంతగా తెలియకపోవచ్చు. అయితే ఆయన కుమారుడు రావు రమేష్ కూడా సినిమాల్లో మంచి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రానిస్తున్నారు.

సొంతూరి ప్రజల గుండెల్లో ఉన్న రావు గోపాల్ రావు…
రావు గోపాల్ రావు గారి గురించి చాలా మందికి వ్యక్తిగత విషయాలు తెలియదు. ఇండస్ట్రీలో ఒక తరానికి విలన్ గా వెలిగిన ఆయన పోయాక కొడుకు సినిమాల్లోకి రావాలన్నా ఎవరి అండ లేకపోయింది. తొలి నాళ్ళలో రావు రమేష్ ఇండస్ట్రీలో కష్టపడ్డారు. ఇక రావు గోపాల్ రావు గారి సొంతూరు గంగనపల్లి లో గ్రామస్థులు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం విశేషం.

చాలా ఏళ్ల క్రితం రావు గోపాల్ రావు గారు చనిపోయాక ఆయన స్వస్థలం లో ఉన్న ఇల్లు, అక్కడి ప్రజల అభిప్రాయాలను ఒక టీవీ ఛానెల్ వాళ్ళు ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఆయన గొప్పతనం తెలిసింది. గ్రామస్తుల ప్రకారం ఆయన అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడేవారట. గ్రామం బాగోగుల గురించి ఆలోచించేవారట, ఎవరైనా ఏదైనా సహాయం కోరి వస్తే వారికి ఖచ్చితంగా సహాయం చెసేవారట. ఇప్పటికీ అయన మరణించి చాలా ఏళ్ళు గడిచినా ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ఊరి ప్రశజాలు తలుచుకోవడం గొప్ప విషయం.






























