Rapper Roll Rida : ర్యాప్ సాంగ్ అనగానే మనకు గుర్తొచ్చేది రోల్ రైడా. తెలుగులో రాపర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోల్ రైడా అసలు పేరు రాహుల్ కుమార్. కరీంనగర్ జిల్లా లో పుట్టిన రాహుల్ చిన్నపటి నుండి పాటలు పాడటం లాంటివి చేసేవాడు. హైదరాబాద్ లో బి.టెక్ చేసిన రాహుల్ కుమార్ ఆ సమయంలోనే తన బ్యాండ్ ను మరొక మిత్రుడితో కలిసి ఏర్పాటు చేసాడు. యూట్యూబ్ లో ఆల్బమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోల్ రైడా తన స్టేజి నేమ్ రోల్ రైడా గా స్నేహితుల సలహా మేరకు మార్చుకున్నాడు. ప్రస్తుతం పెద్ద సినిమాలకు ర్యాప్ సాంగ్స్ అలానే మ్యూజిక్, లిరిక్స్ అందిస్తున్న రోల్స్ రైడా తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు పనిచేసారు.

పూనకాలు లోడింగ్ పాటకు ట్రోల్స్…
చిరంజీవి అంటే ఎంతో ఇస్తామంటూ తెలిపిన రోల్ రైడా ఆయన సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేవిశ్రీ మొదట ఏ సినిమాకు అని చెప్పకుండా పాట రాయమని అడిగితే మొదట చరణం రాసి ఐదు నిమిషాల్లో పంపగా నచ్చి దేవిశ్రీ ప్రసాద్ వెంటనే చెన్నై రమ్మని పిలిచాడంటూ రోల్స్ రైడా చెప్పారు. ఇక పాట కంప్లీట్ చేసాక ఏ సినిమాకు ఈ పాటలు చేయబోతున్నాడో దేవి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటూ రోల్స్ రైడా తెలిపారు.

ఇక పాట ఫ్యాన్స్ కు బాగా నచ్చిందని అయితే కొంతమంది పాటను ట్రోల్స్ చేస్తున్న విషయం గురించి మాట్లాడుతూ అందరికీ అన్నీ నచ్చాలని ఉండదు. ఎపుడూ ప్రశంసలే కాదు విమర్శలు ఉంటేనే మనకు గ్రోత్ ఉంటుంది. చెస్ బోర్డు లో కిడ్స్ వైట్ మాత్రమే కాదు బ్లాక్ కూడా ఉంటాయి. క్రిటిక్స్ తీసుకుంటేనే టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది అంటూ తెలిపారు.































