Rashmi Gowtham : జబర్దస్త్ చూసే ప్రతి ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు రష్మీ. యాంకర్ గా జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన రష్మీ అంతకుముందు అడపాదడపా సినిమాల్లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా వచ్చింది. నిజానికి షో ద్వారా రష్మీ ప్రతి ఇంటి సభ్యురాలిగా అయింది. ఇక సుధీర్ రష్మీ ల మధ్య సాగే కెమిస్ట్రీ అంటే నచ్చని ప్రేక్షకుడు ఉండడు. నిజంగా వారి మధ్య ఏదో ఉంది అనేలా వాళ్ళ ఎమోషన్స్ ఉండేవి. జబర్దస్త్ వల్ల వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది రష్మీ. గుంటూరు టాకీస్ వంటి చిత్రాలలో నటించింది.

కంట తడి పెట్టుకున్న రష్మీ…
శ్రీదేవి డ్రామా కంపెనీ ఇపుడు జబర్దస్త్ కి ధీటుగా ఈటీవీలో వస్తున్న ప్రోగ్రామ్. అందులో ప్రతి వారం ఒక కొత్త కాన్సెప్ట్ తో ఎపిసోడ్ చేస్తారు. అలా ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ లో తొమ్మిదేళ్లుగా రష్మీ పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం చెబుతా అంటూ రష్మీ చెప్పడం, అక్కా బావెక్కడ అనే ఈవెంట్ చేస్తున్నారు. ఇందులో నిజంగా రష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోయే వాడి గురించి చెబుతుందా లేక ఉత్తుత్తి ఈవెంట్ నా తెలియాల్సి ఉంది. అయితే ప్రోమోలో మాత్రం రష్మీ బయోగ్రఫీ వీడియో ఆకట్టుకుంది. చిన్నపుడు రష్మీ తల్లి తండ్రి వీడిపోవడం రష్మీ తన తల్లి తో ఉండాలనుకోవడం చూపించినపుడు రష్మీ ఏడ్చేసింది.

కొన్నాళ్ళ క్రితం ఫాదర్స్ డే నాడు కూడా రష్మీ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదంటూ ఏడ్చడం చూసాము. ఇక ఇపుడు మళ్ళీ ఏడ్చడం, ఇండస్ట్రీ లో తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న సంఘటనలు చూపించినపుడు కంట తడి పెట్టుకుంది. ఇక ప్రోమో చివర్లో తెలుగు మాట్లాడటం రాని స్థాయి నుండి తెలుగు వాళ్ళు మాట్లాడుకునే స్థాయికి వచ్చిన రష్మీ అంటూ కంప్లిమెంట్ ఇవ్వడంతో రష్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం తో ప్రోమో ఎండ్ చేసారు.































