ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల వేతనాలలో కోత విధించేందుకు సిద్ధమవుతున్నారు. అదే క్రమంలో అయన తన వేతనాన్ని పూర్తిగా వదులుకున్నారు. 2008-09 నుంచి సుమారు 12 సంవత్సరాలుగా అయన అదే వేతనాన్ని అందుకుంటున్నారు. ఈ సారి దాన్ని వదులుకున్నారు ముఖేష్ అంబాని. కరోనా ప్రభావం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయిల్ మరియు గ్యాస్ డివిజన్లలో భారీగా కోత ఉండబోతుందని తెలిపింది. ఆయా డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలలో యాభై శాతం వరకు కోతలు విధించనున్నట్టు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో నిర్వహణ వ్యయాలను భరించాలంటే ఈ కోతలు తప్పవని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుండి అమలు లోకి వస్తుందని తెలిపింది. ఈ క్రమంలో ముఖేష్ అంబాని ఆయన పూర్తీ వేతనాన్ని వదులుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సీనియర్ ఎక్సిక్యూటివ్స్ వేతనాల్లో 30 నుంచి 50 శాతం వరకు కోత ఉంటుందని పేర్కొన్నారు. 15 లక్షల కంటే ఎక్కువ వేతనం అందుకునే ఉద్యోగులలో 10 శాతం కోత విధిస్తున్నారు.. అయితే 15 లక్షల కంటే తక్కువ వేతనాన్ని అందుకునే ఉద్యోగులకు మాత్రం ఎటువంటి కోత విధించడం లేదని తెలిపారు.
































