జబర్దస్త్ షో అంటే అందరికీ తెలిసిందే. టాలెంట్ ఉండి.. అవకాశాలు రాకుండా ఉండే వారికి మంచి ప్లాట్ ఫాం ఇచ్చి పాపులర్ కమెడియన్స్ గా ఎదిగేలా చేసిన ఈ కామెడీ షో తొమ్మిది ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇందులో అవకాశం వచ్చిన చాలామంది ఆర్థికంగా బాగున్నారు. యాంకర్స్ రష్మీ, అనసూయ అయితే సినీ తారల మాదిరిగా వెలిగిపోతున్నారు. కరోనా కారణంగా కోట్ల మందికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు కొంత మందికి రెమ్యునరేషన్ తగ్గించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 24 విభాగాలకి చెందిన వారందరు తమ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. మల్లెమాల నిర్మాణంలో వస్తున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వారికి కూడా బాగానే కోతలు పడ్డాయట. జిడ్జిల విషయానికి వస్తే రోజా ఒక్కో ఎపిసోడ్ కు 3 నుంచి 4 లక్షలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పడు ఇందులో కూడా కోత విధించనున్నారని సమాచారం. మనో విషయానికి వస్తే ఎపిసోడ్ కు రూ. 2 లక్షలు, యాంకర్స్ రష్మి, అనసూయలు ఒక్కో ఎపిసోడ్ కు రష్మి రూ.లక్ష, అనసూయ రూ.1.2 లక్షలు తీసుకుంటున్నారు. వీళ్ళ నెల ఆదాయం ఇప్పటి లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల వరకు ఉందనేది సరాసరి అంచనా. అలాగే టీమ్ లీడర్ల విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేవాడు. ఈయన ఉన్నపుడు 3 నుంచి 4 లక్షలు సంపాదించాడట.
సుడిగాలి సుధీర్ టీంతో పాటు హైపర్ ఆదికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. వీళ్ళకు లక్షల్లోనే పారితోషికం అందుతుందని సమాచారం. హైపర్ ఆదికి రూ.2.5, అభి రూ.2 లక్షలు ఇస్తున్నారంటే. భాస్కర్ అండ్ టీంకు రూ. 2 లక్షలు కాగా, చలాకీ చంటి 2 లక్షలు అంటున్నారు. ఇక సునామీ సుధాకర్, కెవ్వు కార్తిక్ కూడా లక్షల్లోనే సంపాదిస్తున్నారట. కరోనా కారణంగా పారితోషికాల్లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తుంది.































