Renjarla Rajesh : బైరి నరేష్ మీద దాడి చేసిన వాళ్ళ మీద సంచలన వాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్…!

0
142

Renjarla Rajesh : అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలను చేస్తూ ఫేమస్ అయిన నాస్తిక వాది బైరి నరేష్. ఆయనకు మద్దతు పలుకుతూ సరస్వతి దేవి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రెంజర్ల రాజేష్. నిమ్న కులాలను వారి మీద జరుగుతున్న అన్యాయాలు, అంటరానితనం మీద పోరాడుతున్నామని చెప్పే రెంజర్ల రాజేష్ తనను తాను హేతువాదిగా చెబుతాడు. దేవుడి మీద నరేష్ చేసిన వ్యాఖ్యలు తనకి నచ్చలేదని చెప్పే రాజేష్ నరేష్ మీద దాడి చేసిన వారికి ఒపన్ ఛాలెంజ్ ఇచ్చాడు.

ఆ ఛానల్ వాళ్ళు అగ్రకులాల వారిని మా పైకి రెచ్చగొడుతున్నారు…

రెంజర్ల రాజేష్ నిమ్న కులం మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడితే ఒక్కరూ స్పందించరు కానీ దేవుళ్ళ మీద వ్యాఖ్యలు చేయగానే బయలుదేరుతారు అంటూ విమర్శించారు. బైరి నరేష్ మాట్లాడినపుడు ఆయన జ్ఞానానికి అయనకున్న సబ్జెక్టు నాలెడ్జి కి సరిపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారని అనిపిస్తే మీడియా సాక్షిగా చర్చ పెట్టి ఆయన చెప్పేది తప్పు అని ఒప్పించండి ఛాలెంజ్ చేస్తున్నా అంటూ చెప్పారు.

ఇక బైరి నరేష్ మీద నా మీద దాడికి ప్రముఖ టీవీ ఛానెల్ వాళ్ళే కారణం అని మొత్తం వీడియో చూపించ కుండా ఎడిట్ చేసి వాళ్లకు కావాల్సినది ప్రసారం చేసుకుని అగ్ర కులాల వాళ్లను మామీదకి రెచ్చగొడుతున్నారు అంటూ ఆరోపించారు. ఇప్పటికీ వినాయకుడిని మాదిగ వీధిలో తిప్పితే దేవుడు కూడా మైల పడిపోయాడని కొన్ని చోట్ల వేరే వీధుల్లోకి రానివ్వలేదు. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న ఇలాంటి అకృత్యాల గురించి ఎవరూ చర్చించరు అంటూ కుల నిర్మూలన జరిగితేనే దేశం బాగుపడుతుందని వివరించారు.