Renu Desai : పవన్ కళ్యాణ్ అనగానే ఫ్యాన్స్ కి పవర్ స్టార్ సినిమాల పరంగా ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇక జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాల్లో నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఒక ఎలక్షన్ లో పాల్గొని ఓటమిని చూసిన ఆయన ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎన్నికలను ప్రభావితం చేసే శక్తిగా మారుతున్నాడు. అదృష్టం, కష్టం కలిసి వస్తే సీఎం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక రాజకీయాల్లో ప్రభుత్వం పైన విమర్శలు, ప్రత్యర్థుల నుండి ప్రతి విమర్శలు మామూలే. అలానే పవన్ కళ్యాణ్ ను కూడా ఆయన వ్యక్తిగత విషయమైన పెళ్లి గురించి వైసీపీ నేతలు పదే పదే మాటాడుతూంటారు.

నాతో విడిపోయిన వాళ్ళకి న్యాయం చేశాను… పవన్ నుండి ఒక్కరూపాయి తీసుకోలేదు…
పవన్కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అనగానే ఆయన పెళ్లిళ్లు అందరికీ గుర్తొస్తాయి. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. పవన్ మొదట పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకున్నా ఆమెతో విడిపోయారు. నందిని తో విడిపోయినపుడు ఆమెకు ఐదు కోట్లు ఇచ్చారట. ఇక మళ్ళీ సహజీవనం చేస్తూ హీరోయిన్ రేణుదేశాయ్ తో ఇద్దరు పిల్లలను కన్న తరువాత పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెతోనూ విడిపోయి విడాకులు తీసుకున్నారు పవన్. ఇక ఆమెతో విడిపోయినపుడు కూడా ఆమెకు భరణం చెల్లించారట. అయితే పవన్ ఆయన పెళ్లిళ్ళ గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారీ స్పందించేవారు కాదు.

కానీ ఈసారి వైసీపీ వాళ్లకు తన పెళ్లిళ్ళ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నా పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు మీరూ కావాలంటే పెళ్లిళ్ళు చేసుకొండి. నేను విడిపోయినపుడు వాళ్లకు అన్యాయం చేయలేదు, భరణం చెల్లించాను అంటూ చెప్పారు. అయితే వైసీపీ వాళ్ళు ఈ మాటలకు ఊరికే అయిపోలేదు. రేణు దేశాయ్ పాత ఇంటర్వ్యూలకు సంబందించిన వీడియోలలో విడిపోయినపుడు పవన్ నుండీ నేను ఒక్క రూపాయి కుడా తీసుకోలేదు అన్న వీడియోను సోషల్ మీడియా లో బాగా వైరల్ చేస్తున్నారు. దీంతో అసలు రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదు.


































