Political News

Renu Desai: అకీరా మోడీని కలవడంపై ఎమోషనల్ అయిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!

Renu Desai: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయన గెలిచినప్పటి నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన కుమారుడు అకీరా తన తండ్రి వెంటే ఉంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సైతం ఆయన ఎక్కడికి వెళ్లిన తన కొడుకుని కూడా వెంట తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు తన భార్య అన్నాతో పాటు అకీరాని కూడా వెంట తీసుకు వెళ్లి చంద్రబాబు నాయుడుకి పరిచయం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసిన సంగతి తెలిసిందే

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా రేణు దేశాయ్ బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు గతంలో కూడా ఈమె ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేశారు.

మాటలు రావడం లేదు..
ఈ క్రమంలోనే తన కుమారుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ..ఇవాళ నా కొడుకు అకీరాని పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడటం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది కానీ మాటలు రావట్లేదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసాక అకిరా నాకు కాల్ చేశాడు. మోదీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, అయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago