Political News

Sharwanand: శర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత.. పేరుకు ముందు ఆ స్టార్ ఉండాల్సిందే?

Sharwanand: శర్వానంద్ పరిచయం అవసరం లేని పేరు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ హీరోలకు తమ్ముడి పాత్రలలో నటిస్తూ ఉన్నారు అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఈయన మనమే అనే సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా నేడు విడుదల అయింది శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదల అయింది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో నిర్మాత విశ్వప్రసాద్ శర్వానంద్ కి ఒక స్టార్ ట్యాగ్ ఇచ్చారు. ఆ ట్యాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శర్వానంద్ కు ఛార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు.చార్మింగ్ స్టార్ అనే టైటిల్ లోగో అక్కడ స్క్రీన్ పై ప్లే చేసి మరి చూపించారు . దీంతో శర్వానంద్ ఫ్యాన్స్ అరుపులు కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇలా నిర్మాత తనకు సరికొత్త ట్యాగ్ ఇవ్వడంతో శర్వానంద్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు.

చార్మింగ్ స్టార్..
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ముందుగా తనకు ఇలాంటి ట్యాగ్ ఇచ్చినందుకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తాను మహానుభావుడు సినిమా చేసే సమయంలోనే డైరెక్టర్ మారుతి తనకు పేరు ముందు ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోమని సలహా ఇచ్చారు. కానీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో పట్టించుకోలేదని ఈ సందర్భంగా అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago