Renu Desai : ‘బద్రి’ సినిమా హీరోయిన్ గా అందరికి కీ పరిచయమైన మరాఠి అమ్మాయి రేణు దేశాయ్ ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడటం, ఇద్దరూ సహజీవనం చేయడం, ఇద్దరు పిల్లలు పుట్టాక 2009 లో పెళ్లి చేసుకోవడం, మళ్ళీ 2012 లో విడాకులు తీసుకోవడం ఈ విషయాలన్నీ తెలిసినవే. విడాకుల తరువాత రేణు దేశాయ్ పిల్లల్తో ఉంటుండగా పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకున్నాను అనగానే పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో ఆమె బాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైంది. ఈ ఇష్యూలన్నీ పక్కన పెడితే రేణు దేశాయ్ మరోసారి సినిమాల్లో బిజీ కావాలని భావిస్తోంది. తాజాగా రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాలో కూడా నటిస్తోంది.

గుండె సమస్యతో బాధపడుతున్న రేణు…
ప్రస్తుతం పిల్లలతో కలిసి జీవిస్తున్న రేణు దేశాయ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తాను గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు పోస్ట్ పెట్టారు. తాను గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నానని అయితే ప్రస్తుతం యోగా ద్వారా ఆ సమస్యను అధిగమించాలని భావిస్తున్నట్లు తెలిపారు. నాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు భయపడకుండా మనోధైర్యంతో ముందు సాగాలంటూ ధైర్యం చెప్పారు.

ఇటీవలే హీరోయిన్ సమంత కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ కూడా అనారోగ్య సమస్యలతి బాధపుతున్నట్లు తెలిసీ చాలా మంది నెటిజన్స్ ఆమెకు ధైర్యంగా ఉండాలంటూ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
































