టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పిన చిత్రం “బద్రి”. ఈరోజు అనగా ఏప్రిల్ 20 నాటికి అక్షరాలా 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంది బద్రి సినిమా… ఈ సందర్భంగా బద్రి సినిమా షూటింగ్ సమయంలోని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు ఆ సినిమా హీరోయిన్ రేణు దేశాయ్..

ఈ క్రమంలో “బద్రి” చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు రేణు. అటువంటి ఫోటోలలో ఒక ఫోటో సినిమా షూటింగ్ జరుపుతున్న సమయంలో ఒక రాయిపై పవన్ కళ్యాణ్ కూర్చొని ఉంటె.. హీరోయిన్ రేణు దేశాయ్ పవన్ తో ముచ్చటిస్తున్నట్టుగా ఉంది.

ఈ ఫోటోను షేర్ చేస్తూ… “ఒక రిమోట్ లొకేషన్ లో బద్రి షూటింగ్ సమయంలో అక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడాలేవు. నేను షార్ట్స్ పై ఉండటంతో ఒకవేళ కుర్చీలు ఉన్నా కూర్చోలేని పరిస్థితి. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఒక రాయిపై కూర్చొని ఉండటంతో… ఒక అమ్మాయి ఇలా నిలబడి ఉండగా మీరు అలా కూర్చోవడం మంచి పద్దతి కాదు… అంటూ పవన్ కళ్యాణ్ గారితో జోక్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది” అంటూ షేర్ చేసారు.

మరొక ఫోటోను షేర్ చేస్తూ… “పవన్ కళ్యాణ్ గారు ఏ చికీతా.. పాట షూటింగ్ అయిపోయాక…నేను వరమంటే…సాడ్ సాంగ్ చిత్రీకరణ అయిపోయాక బాగా అలసిపోయి కూర్చున్నాం. ఆ షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు చాలా దూరం నడిచాం. అందుకే అలిసిపోయి మా ప్రపంచాలను మరిచిపోయి ఆకలితో… అలసటతో అలా కూర్చొని ఉన్నాం.. ఆ సమయంలో తీసి ఫోటో ఇది…” అంటూ పోస్ట్ చేసారు రేణు దేశాయ్.































