RGV : రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సినిమాల్లో కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన వ్యక్తి. ఒక్క తెలుగుకే కాదు ఏకంగా ఇండియన్ సినిమాక్ కొత్తపంథా చూపించాడు వర్మ. వర్మ స్టైల్, కథా కథనం అన్నీ డిఫరెంట్, అప్పటి యూత్ ని బాగా ఆకట్టుకునేవి సినిమాలు. వర్మ సినిమాలంటే ఒక మంచి క్రేజ్ ఉండేది. అది ఈ మధ్యకాలంలో బాగా మసకబారింది. ఏడాదికి రెండు మూడు సినిమాలు వస్తున్నా అవి అసలు జనాలకు తెలుస్తున్నాయో లేదో కూడా తెలియదు. ఇక జనాలు వర్మ సినిమా చూడటం కోసం థియేటర్ రావడం ఎప్పుడో మానేసారు. ఇక అయన భక్తులకే బోర్ కొట్టేసాయి వర్మ సినిమాలు, కామన్ ఆడియన్స్ ఏమి చూస్తారు. ఇక ఆయన మార్కెటింగ్ ట్రిక్స్ కి కూడా పడేలా జనాలు ఇపుడు లేరు. వర్మ మాటలను పెద్దగా పట్టించుకోవడం మానేశారు అయన అభిమానులు. అయితే వర్మ మాటలకు ఫిలాసఫీకి మాత్రం ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు.

నన్ను చంపాలని అనుకున్నారు.. కాలేజ్ గొడవల్తో జైలుకి…
ముంబైలో అపార్టుమెంట్ లో ఉన్నపుడు మొదటి సారి ఒక 15 సెకన్లు భయం అంటే ఏంటో తెలిసింది అంటూ వర్మ చెప్పారు. హిందీలో మాఫియా బ్యాక్ గ్రౌండ్ సినిమాలను చేసిన వర్మ కు ఖచ్చితంగా తనను చంపడానికి ఎవరో మాఫియా వాళ్ళే వచ్చారని అనుకున్నాడట. అపార్ట్మెంట్ కింద వాళ్ళు వర్మ నే చూస్తుండటం వల్ల భయమేసి కార్లో నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి ఐదో అంతస్తూ వరకు ఆగకుండా మెట్లెక్కి అక్కడా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి, కింద వారి డ్రైవర్ ద్వారా వర్మ తన డ్రైవర్ కి కాల్ చేసి పరిస్థితి ఏంటి కింద అని అడిగితే ఆ వాన్ లో వచ్చిన వాళ్ళు లిప్ట్ రిపేర్ చేయడాసనికి వచ్చిన వాళ్ళు అని చెప్పాడట.

కానీ ఆ సంఘటనలో ఒక 15 సెకెన్లు భయపడ్డానని చెప్పారు. ఇక విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లో ఇంటర్ చదవే సమయంలో గ్యాంగ్ గొడవలు ఉండేవి అంటూ చెప్పారు. లోకల్, నాన్ లోకల్ అంటూ గొడవలు ఉండేవి. ఎపుడూ గొడవల్లో కొట్టానే కానీ కొట్టించుకోలేదు అంటూ చెబుతూ లగడపాటి రాజ్ గోపాల్, నేను మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి గొడవలో బాగా కొట్టాం కొంతమందిని దెబ్బకి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇంట్లో వాళ్లకు లెటర్ రాసి మరీ చెప్పారు అని తన పూర్వ అనుభవలని పంచుకున్నారు.

































