డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎన్నో సార్లు చూసిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఏంటో తెలుసా.?!

0
251

తెలుగు చలన చరిత్రలో ఒక క్లాసిక్. ఈ సినిమా సస్పెన్స్ జోనర్ లో ఆల్ టైం హిట్ సినిమాగా నిలిచిపోయింది. విభిన్న కథలతో సినిమాలు తీసే వంశీ అపూర్వ సృష్టి. ఈ తరం ప్రేక్షకులు కూడా టీవీ ఛానల్స్ ద్వారానో లేక యూట్యూబ్ ద్వారా నో ఈ సినిమా చూసే ఉంటారు. ఎంతోమంది సృజనాత్మక దర్శకులకు ఈ సినిమానే ఓ ప్రేరణ. ఈ సినిమా తర్వాత దర్శకులు ఎన్నో త్రిల్లర్ మూవీస్ తీసినప్పటికీ ఈ సినిమాకి వందోవంతు కూడా చేరుకోలేక పోయాయి.

దర్శకుడు వంశీ తాను సినిమాల్లోకి రాకముందు డిటెక్టివ్ నవలలు అద్దెకు తీసుకుని చదివేవాడు. ఆ క్రమంలో నవలలన్న అన్న సినిమాలన్నా వంశీ కి చాలా ఇష్టం కానీ కమర్షియల్ సినిమాలకే డిమాండ్ ఉండడంతో తను ఎప్పటి నుంచో త్రిల్లర్ లైను అనుకున్నప్పటికీ అది బయటకు రాలేక పోయింది. ఆ తర్వాత వంశీ తీసిన సితార సినిమా పెద్ద హిట్ అయ్యింది. అప్పుడు కామినేని ప్రసాద్ వంశీ వద్దకు వచ్చి ఒక సినిమా చేసి పెట్టాలని కోరాడు. ఫలానా కథ అని నేను ఏమి చెప్పను నీకు ఇష్టమైన కథతో సినిమా తియ్యి ఆ కథేమిటో నాలుగు ముక్కలు నాకు చెప్తే చాలు అని ఆయన వెళ్ళిపోయాడు.
ఇంత ఫ్రీడం ఇచ్చేసరికి దర్శకుడు వంశీ తాను అనుకున్న థ్రిల్లర్ జోనర్ లో ఓ సినిమా చేయాలనుకున్నాడు.

కొంత మంది రెగ్యులర్ రైటర్స్ త్రిల్లర్ కథ చెబితే వంశీ కి అంత నచ్చలేదు. దర్శకుడు వంశీ ఇంతకుముందు అపరిచితులు అనే కన్నడ సినిమా ను చూశాడు. ఆ సినిమా మొత్తం అడవి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కావునా తాను కూడా ఓ అడవి బ్యాక్ డ్రాప్ లో కథ రాయాలి అనుకున్నాడు. అప్పుడు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన తుఫాన్ కరెంటు పూర్తిగా స్తంభించిపోయింది.. స్వయంగా తానే ఓ త్రిల్లర్ స్టోరీని వంశీ సిద్ధం చేశాడు. హీరోయిన్ భానుప్రియ ప్రధాన పాత్రగా సినిమా కొనసాగుతుంది.

అడవి నేపద్యం గనుక దర్శకుడు వంశీ అండ్ యూనిట్ తిరుపతి దగ్గర తలకోన అడవికి వెళ్లారు. తలకోన అడవిలో షూటింగ్ చేస్తున్న తలకోన అంటే వీరికి ఏమిటో తెలియదు. తలకోన అంటే ఎత్తైన కొండ అని తెలుసుకుని అక్కడికి వెళితే వాటర్ ఫాల్స్ రానడంతో సినిమా యూనిట్ ఎగిరి గంతేసారు. యెదలో లయ.. అనే ఇళయరాజా స్వరపరిచిన ఈ గీతాన్ని ఇక్కడే షూట్ చేయడం జరిగింది. 1985 మే 22న అన్వేషణ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ఈ సినిమాను ఎన్నో సార్లు చూశారు. ఇలాంటి జోనర్ లోనే వర్మ ఎన్నో చిత్రాలు నిర్మించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here