Rocket Raghava : రాకెట్ రాఘవ, జబర్దస్త్ చూసే వాళ్లకి ఈయన గురించి పరిచయం అవసరం లేదు. 2001 లో సినిమాలలో చిన్న చిన్న హాస్య పాత్రల ద్వారా పరిచయం అయ్యి సీరియల్స్, టీవీ షోలలో చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. తరువాత 2013 లో ఈటీవీలో ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రోగ్రాంలో రాకెట్ రాఘవ అనే టీమ్ తో ఇప్పటి వరకు కొన్ని వందల స్కిట్లతో అభిమానులను అలరిస్తున్నాడు. జబర్దస్త్ షో మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు వస్తు వెళ్తున్న వున్నా రాఘవ మాత్రం ఇప్పటికి కొనసాగుతూనే వున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవ జబర్దస్త్ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు చెప్పారు.

జబర్దస్త్ ను వదిలిపెట్టాలంటే నాకు భయం..
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. జబర్దస్త్ షో ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను అని ఆయన చెప్పారు. సీనియర్ యాక్టర్ ల నుంచి చాలా నేర్చుకున్నాను అని అలాగే షో కి వచ్చే కొత కమెడియన్ల నుంచి నేర్చుకొని నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను అని ఆయన చెప్పారు. జబర్దస్త్ షో మొదట్లో కన్నా ఇప్పుడే బాగుంది అని, తక్కువ టైంలో ఎక్కువ కామెడీ అందించగలుగుతున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ వీడి వెళ్లడం గురించి ప్రస్థావించగా…రెండు కారణాల వలన నేను జబర్దస్త్ వీడి వెళ్లనని ఆయన చెప్పారు. మొదటిది చేసే పని లో సంతృప్తి అనేది ఇక్కడ దొరుకుతుంది అని ఆయన చెప్పారు. ఇక రెండవది వెళ్లిన వాళ్ళ పరిస్థితి చూస్తే భయం వేస్తుంది, వదిలి వెళ్లి పోతే ఈ ప్లేస్ మళ్ళీ మనకు దొరకదు అందుకే నాకు వెళ్లాలంటే భయం అని చెప్పారు. మొదట్లో తనపై వచ్చిన కోల్డ్ వార్ గురించి అడుగగా అసలు నాకు దాని గురించి తెలియదని, నేను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పుకోచ్చారు.































