Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాకేష్ ఒకరు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన రాకేష్ తన తోటి కమెడియన్ జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల వీరిద్దరికీ ఓ చిన్నారి కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఇక సుజాత కూడా కెరియర్ పరంగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

రాకేష్ కేసీఆర్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాకేష్ నటించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా అప్పట్లో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 22వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు రోజా కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే జబర్దస్త్ టీం అంతా కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేయడమే కాకుండా ఈ సినిమాకి మంచి విజయం అందించాలని కోరుకున్నారు. ఇక ఈ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని ఇల్లు కార్లు అన్నీ కూడా తాకట్టు పెట్టామని రాకేష్ తెలిపారు.

Rocking Rakesh: ప్రమోషన్స్..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన అర్ధరాత్రి హైదరాబాద్ వీధులలో తిరుగుతూ గోడలకు పోస్టర్లను ఆయనే అతికిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందులో సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో కొందరు ఇలా చిన్న చిన్న పనులను వాళ్లే చేసుకుంటూ సినిమా ఖర్చులను తగ్గించుకుంటున్నారని ఈ సినిమాని సక్సెస్ చేయాలని కామెంట్లు చేయగా మరికొందరికి ఇది ఒక రకమైన ప్రమోషన్ అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మరి హీరోగా రాకేష్ నటించిన ఈ సినిమా ద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.





























