ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటికీ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఎంతో మార్పు చోటు చేసుకుంది. కరోనా ప్రభావం వల్ల గతంతో పోలిస్తే ప్రస్తుతం మన జీవన విధానం చాలా భిన్నంగా మారింది. కరోనా రాకముందు ఇంట్లో గడపడానికి ఎంతో ఇబ్బందిగా భావించే వారు ప్రస్తుతం 24 గంటలు ఇంట్లో గడపాల్సిన సమయం వచ్చింది. ఈ విధంగా కరోనా రాక ముందు మన ఇంట్లో పోయి వెలగడం చాలా అరుదు అలాంటిది కరోనా ప్రభావం వల్ల ఇంట్లోనే వంట చేసుకుంటూ ఎంతో పోషకాహారాన్ని తీసుకోగలుగుతున్నాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కరోనా మన జీవితాన్ని ఎంతగానో మార్చిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం కరోనా వ్యాధి చెందినట్లే భవిష్యత్తులో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందితే మనుషుల అలవాట్లు, వ్యవహారశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయనే చర్చ కూడా సాగుతోంది. ఇలాంటి చర్చ సాగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది.
ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి ఒక అమ్మాయి తనకు వరుడు కావాలంటూ ఇచ్చిన పత్రికా ప్రకటన మాజీ మంత్రి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. సాధారణంగానే ఎన్నో మ్యాట్రిమోని ఉన్న సమయంలో వధువు కోసం వరుడు, వరుడి కోసం వధువు పత్రికా ప్రకటనలు వివిధ రకాల నిబంధనలు పెడుతూ ఇవ్వడం మనం చూస్తుంటాము. కానీ ప్రస్తుతం మంత్రి చేసిన ట్వీట్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం వల్ల ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ క్రమంలోనే రోమన్ క్యాథలిక్ వర్గానికి చెందిన 24 ఏళ్ల ఓ యువతి తనకు కావాల్సిన వరుడి కోసం పత్రికలో ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనలో మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ, తనని పెళ్లి చేసుకోబోయే వరుడు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వధువు పత్రికలో ప్రకటన ఇచ్చింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఉండాలని యువతి పత్రికా ప్రకటన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ విధంగా కరోనా సమయంలో పెళ్లి చేసుకోవాలని యువతులు తనకు కాబోయే భర్త తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మాజీ కేంద్రమంత్రి షేర్ చేస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























