RRR : ప్రస్తుత కాలంలో ఓటిటి హవా బాగా నడుస్తోంది. కొన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదల చేస్తుంటే, కొన్నింటిని మాత్రం థియేటర్ లో విడుదల అయిన కొన్ని రోజులకి ఓ టి టి లో విడుదల చేస్తున్నారు. ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల చేసిన సినిమాలకు డబ్బులు చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుంది. దీన్ని పే పర్ వ్యూ కాన్సెప్ట్ అంటారు. అయితే థియేటర్ లో విడుదల అయిన తరువాత ఓ టీ టీ లో విడుదల అయిన వాటికి సబ్ స్క్రిప్షన్ ఉంటే చాలు, డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఇలా ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్ లో విడుదల అయ్యి ఓటీటీ లో సందడి చేసాయి. అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓ టీ టీ లో విడుదల కానుంది. కానీ ఈ సినిమాని ఓ టీ టీ లో చూడటానికి కొన్ని మార్పులు చేశారట.

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ లో చూడాలంటే టికెట్ కొనాలా…
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రూ.550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.1127 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నట విశ్వరూపం తో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన నెలరోజుల వరకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను థియేటర్లో అలరించింది. అయితే అభిమానులు అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని, అయితే ఆ తరుణం రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను జీ5, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. మే 20 వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా జీ 5 లో విడుదల కానుందని సమాచారం.
అయితే ఓటీటీ లో విడుదలైన తర్వాత ఈ సినిమాను చూడాలంటే ఫ్రీ గా చూడటం కుదరదట. సినిమా చూడాలి అంటే డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా ఓ టీ టీ లో విడుదల అయిన తర్వాత సినిమాకు డబ్బులు పెట్టి సినిమా చూడటం ఇదే మొదటిసారి. ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న అప్పుడు పే ఫర్ వ్యూ కాన్సెప్ట్ ని అనుకోలేదట. కానీ ఎక్కువ మొత్తం లో రైట్స్ కొనడం వలన పే ఫర్ వ్యూ కాన్సెప్ట్ ని తెచ్చారాట. అయితే ప్రతిసారి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. మొదటి 10 రోజులు సినిమా ఓటీటీ లో చూడాలి అని అనుకుంటే మాత్రం డబ్బు చెల్లించాలి. 10 రోజుల తరువాత ఉచితంగా చూడవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓ టీ టీ లో సందడి చేయడానికి వచ్చేస్తోంది.



































