RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్.యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ద్వారా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన అనంతరం ఈ సినిమాకు తప్పకుండా సీక్వెల్ చిత్రం ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రైటర్ విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని పలు సందర్భాలలో తెలియజేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా సీక్వెల్స్ తప్పకుండా ఉంటుంది కాకపోతే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.ఈయన దర్శక పర్యవేక్షణలో మరొక డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాజమౌళి మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసిన తర్వాత తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం సినిమా పనులలో బిజీ కానున్నారు దీంతో ఈ సినిమా సీక్వెల్ ఆయన డైరెక్షన్ లో చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి రాజమౌళి కాకుండా వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తారంటే హీరోలు ఒప్పుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…