YS Jaganmohan Reddy: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం RRR.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అద్భుతమైన రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకోవడానికి గల కారణం మంచి కథ,హీరోల నటన మాత్రమే కాకుండా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశారు. ఇలా ప్రమోషన్ కూడా ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ తో అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు.

ఈ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే వారు. అదే విధంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన ప్పటికీ తాజాగా కొందరు ఆర్.ఆర్. ఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్లు చేస్తూ ఉన్నారు.
సీఎంను ఉద్దేశిస్తూ…
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రొఫెసర్ అనే ట్విటర్ ఖాతాదారుడు ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ ట్విటర్ ఖాతాను ఉద్ధేశిస్తూ.. ‘‘ అకౌంట్ అమ్ముతావా మావా’’ అంటూ అడిగారు. దీంతో నీ డీపీ లో ఉన్న అతని అడుగు కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ వేస్తాడేమో అని ట్వీట్ చేసారు. అయితే అతని డీపీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంత సమయానికి ఈ ట్వీట్ డిలీట్ చేశారు.
Deyyy @RRRMovie Antha Maata Annav Yentra Rey ???????? pic.twitter.com/cXJcOVq7Ve
— power ⭐ (@PowerStar_i) May 22, 2022





























