Movie News

ulka gagan gupta: రుద్రమదేవి లోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?

ulka gagan gupta: ఇండస్ట్రీ లోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి అనంతరం వారి చదువులు పూర్తయిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఉల్కా గగన్ గుప్తా ఒకరు. ఉల్కా అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ రుద్రమదేవి సినిమాలో చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరికీ టక్కున గుర్తొస్తుంది.

ఈమె ముంబైలో పుట్టి పెరిగారు. ఈమె తండ్రి కూడా నటుడు కావడంతో ఈమె ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్లో అద్భుతమైన నటన కనపరిచిన ఉల్కాకు అనంతరం వరుస అవకాశాలు రావడంతో ఎంతో బిజీ అయ్యారు.

ఈ విధంగా ఒక వైపు చదువుకొని కొనసాగిస్తూనే మరోవైపు నటనలో కూడా రాణించారు.ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో కూడా ఈమె చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో నటించి అందరిని మెప్పించారు.ఈ విధంగా చిన్నవయసులోనే ఎంతోమందిని ఆకట్టుకున్న ఉల్క అనంతరం పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన ఆంధ్ర పోరి సినిమా ద్వారా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.

సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఉల్క గుప్తా…

ఈ సినిమా అనంతరం ట్రాఫిక్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా ఈమె సినిమాలతో పాటు సీరియల్లో నటించడమే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. తాజాగా రేవతి సుహాసిని నిత్యామీనన్ వంటి తదితరులు నటించిన మోడర్న్‌ లవ్‌ హైదరాబాద్‌’. వెబ్ సిరీస్ లో కూడా నటించారు.ప్రస్తుతం ఉల్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఫోటోలు చూసి చిన్నప్పటి రుద్రమదేవి నా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago