ulka gagan gupta: ఇండస్ట్రీ లోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి అనంతరం వారి చదువులు పూర్తయిన తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఉల్కా గగన్ గుప్తా ఒకరు. ఉల్కా అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ రుద్రమదేవి సినిమాలో చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అందరికీ టక్కున గుర్తొస్తుంది.

ఈమె ముంబైలో పుట్టి పెరిగారు. ఈమె తండ్రి కూడా నటుడు కావడంతో ఈమె ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్లో అద్భుతమైన నటన కనపరిచిన ఉల్కాకు అనంతరం వరుస అవకాశాలు రావడంతో ఎంతో బిజీ అయ్యారు.

ఈ విధంగా ఒక వైపు చదువుకొని కొనసాగిస్తూనే మరోవైపు నటనలో కూడా రాణించారు.ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో కూడా ఈమె చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో నటించి అందరిని మెప్పించారు.ఈ విధంగా చిన్నవయసులోనే ఎంతోమందిని ఆకట్టుకున్న ఉల్క అనంతరం పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన ఆంధ్ర పోరి సినిమా ద్వారా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.
సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఉల్క గుప్తా…
ఈ సినిమా అనంతరం ట్రాఫిక్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా ఈమె సినిమాలతో పాటు సీరియల్లో నటించడమే కాకుండా ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. తాజాగా రేవతి సుహాసిని నిత్యామీనన్ వంటి తదితరులు నటించిన మోడర్న్ లవ్ హైదరాబాద్’. వెబ్ సిరీస్ లో కూడా నటించారు.ప్రస్తుతం ఉల్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఫోటోలు చూసి చిన్నప్పటి రుద్రమదేవి నా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు.































