Sadist Laywer : విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన న్యాయవాది వృత్తి చేస్తున్న గోదావరి మధుసూదన్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్ళు తన భార్యను చీకటి గదికి పరిమితం చేసాడు. కోర్ట్ సహాయంతో పోలీసులు ఆమెను నేడు విడుదల చేయగా 13 ఏళ్ల తరువాత ఆమె మొదటి సారి వెలుతురు చూసింది. ఇంత శాడిస్ట్ గా ఉన్న మధుసూదన్ రావు అతని కుటుంబం ఈ ఘటన మీద సమర్తించుకోవడం ఆశ్చర్యకరమైన విషయం.

13 ఏళ్లుగా నరకం చూసిన సాయి సుప్రియ…
సత్యసాయి జిల్లాకు చెందిన సాయి సుప్రియ కు విజయనగరం వాసి గోదావరి మధుసూదన్ కు 2008లో పెళ్లి కాగా మొదట మధుసూదన్ సాఫ్ట్ వేర్ గా బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టాక విజయనగరంలోనే న్యాయవాదిగా ప్రాక్టిస్ చేస్తానని చెప్పి విజయనగరం షిఫ్ట్ అయ్యారు. ఇక మొదట్లో సాఫిగానే వీరి సంసారం సాగినా మధుసూదన్ తమ్ముడు, అమ్మ మాటలను విని మధుసూదన్ భార్య పుట్టింటి వారిని ఇంటికి రానివ్వకుండా అలానే ఆమెను పుట్టింటికి దూరం చేసేసాడు. ఇక మెల్లగా సుప్రియను బయటి ప్రపంచానికి దూరం చేసేసాడు. ఇంట్లోనే ఒక చీకటి గదికి పరిమితం చేసాడు.

సుప్రియ తల్లిదండ్రులు ఆమెను చూడాలని కానీ మాట్లాడాలని ప్రయత్నం చేసినా ఏదో ఒకటి చెప్పి వారిని కలవనివ్వలేదు. ఇక సుప్రియ పోలీసులను ఆశ్రయించాలనుకున్నప్పుడు కూడా మధుసూదన్ సర్ది చెప్పి ఫిర్యాదు చేయకుండా ఆపించాడు. ఇక ఆ తరువాత బయటి వారితో ఫోన్ కమ్యూకేషన్ అన్ని ఆమెకు దూరంచేసి ఇంట్లోనే నిర్భందించాడు. చివరికి సాయి సుప్రియ తల్లి పోలీసులను ఆశ్రయించి కూతురుని చూపించమని అడగడంతో పోలీసులు వెళ్లగా సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారని నిలాదీసి వెనక్కి పంపాడు. ఇక కోర్ట్ ఆదేశాలతో సాయి సుప్రియను పోలీసులు ఆ చీకటి నిర్భంధం నుండి బయటకు తీసుకోచ్చారు.































