Sai Dharam Tej: మెగా అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యే తీవ్ర గాయాలు పాలైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల 21వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాదులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక నిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తిరిగి ఈ వేదికపై నిలబడ్డాను అంటే అది కేవలం మీ ఆశీర్వాదం మీ ప్రేమ ప్రార్థనల వల్లే అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

Sai Dharam Tej: పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది…
ఇక విరూపాక్ష సినిమా గురించి మాట్లాడుతూ సుకుమార్ గారు 2019వ సంవత్సరంలోనే ఈ సినిమా కథ వినాలని చెప్పారు. ఇది ఒక ప్రేమ కథ అయ్యుంటుంది అనుకున్నాను కానీ కార్తీక్ వచ్చి ఇది క్రైమ్ త్రిల్లర్ అని చెప్పగానే షాక్ అయ్యానని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కథ విన్న తర్వాత ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అవుతుందని భావించి ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన తెలియజేశారు. ప్రస్తుతం సాయి తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























