Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత చాలా తక్కువగా బయట కనబడుతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన ఒక సినిమా ఈవెంట్లో ముఖ్యఅతిథిగా సందడి చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని ఇదివరకు కిరణ్ తనని తన సినిమా ఈవెంట్లకు ఆహ్వానించిన తాను రాలేకపోయానని తెలిపారు.ఇక చిత్ర బృందానికి కూడా ఈయన బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని అన్న మీ పెళ్ళెప్పుడు అంటూ ప్రశ్నించారు.
ఇలా అభిమాని ప్రశ్నకు వెంటనే రియాక్ట్ అయినటువంటి సాయి ధరమ్ తేజ్ చెప్తాను ఎప్పుడైతే మీరు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడే అది మీ వల్ల అవుతుందా? అంటూ అభిమానులపై కాస్త ఫైర్ అయ్యారు. ఇంకా కంటిన్యూ చేస్తూ.. ‘పెళ్లి ఎవ్వడు రా.. ముందు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి.

Sai Dharam Tej: నాలుగు సార్లు పెళ్లి చేశారు…
ఇక ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి జరిగిపోయింది సోషల్ మీడియాలో తనకు ఇదివరకే నాలుగు సార్లు పెళ్లి చేసేసారని ఈ సందర్భంగా సాయి ధరంతేజ్ వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన రిపబ్లిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తర్వాత ఈయనకు రోడ్డు ప్రమాదం జరగడంతో అనంతరం సినిమాలకు కాస్త దూరమయ్యారు. తిరిగి ప్రస్తుతం పలు సినిమాలతో సాయి ధరమ్ తేజ్ బిజీగా ఉన్నారు.





























