Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల బైక్ ప్రమాదం వల్ల తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ కొంతకాలం ఇంటికే పరిమితం అయ్యాడు. ఇక ఇటీవల అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్ పనులతో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమాలో నటించి ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్.. సినిమా విశేషాలతోపాటు తనకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో జరిగిన సంఘటనల గురించి కూడా ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు.
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ఓ సందేశం గురించి సాయి ధరమ్ తేజ్ బయటపెట్టాడు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..”యాక్సిడెంట్ తర్వాత మామయ్య (చిరంజీవి) నుంచి ఓ సందేశం వచ్చింది. అదేమిటంటే.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి` అనే లైన్‌ని తనకు సందేశం పంపినట్టు ధరమ్ తేజ్ వెల్లడించాడు
ఆ ఒక్క లైన్ తనని ఎంతో ఇన్‌స్పైర్ చేసిందని, తనలో కసిని పెంచి…. తాను మళ్లీ మామూలు మనిషి అయ్యేందుకు ఆ మాట ఎంతో దోహదపడిందని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. జీవితం అంటే సుఖ సంతోషాలతో పాటు కష్టాలు కూడా వస్తాయి. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను చూసి భయపడితే జీవితమే లేదని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. యాక్సిడెంట్స్ తర్వాత తన జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయని, ఆ యాక్సిడెంట్స్ తనకు ఒక స్వీట్ మెమరీ అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…