Sai Dharam Tej : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు చాలామంది ఉన్నారు. అయితే కొంత మంది రానా, నిఖిల్ వంటి హీరోలు కరోనా సమయంలో పెళ్లి పీటలు ఎక్కి లిస్ట్ ని తగ్గించేశారు. అయితే ఇప్పటికీ అప్పటికీ ఈ లిస్ట్ లో మొదటి పేరు మాత్రం ప్రభాస్ కే చెందుతుంది. ఇక అక్కినేని కుటుంబం నుంచి అఖిల్, మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ పెళ్లికోసం రెడీగా ఉన్నారు. వారి వారి కెరీర్ లో బిజీగా ఉంటూ కొంతమంది పెళ్ళి గురించి ఆలోచించట్లేదు. అయితే ప్రస్తుతం మెగా హీరోకి చెందిన ఒకరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రేమించిన అమ్మాయి తోనే పెళ్లి…
మెగా కాంపౌండ్ నుంచి వెండితెరకు పరిచయం అయిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ‘పిల్ల నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల ఒక ఆక్సిడెంట్ నుండి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కొన్నిసార్లు సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పటికీ, ఈ సారి మరో రెండు నెలల్లో పెళ్లి పక్కా అని అంటున్నారు.

అంతేకాదు పెళ్లి కూడా తాను ప్రేమించిన అమ్మాయి అని సమాచారం. అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి సంబందించిన వారు కాదంట, పెళ్లి కూడా అమ్మాయి వాళ్ల ఇంట్లోనే అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలసి వినోదయ సీతం రీమేక్ లో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ సమాచారం నిజం అయితే వచ్చే రెండు నెలల్లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త అభిమానులు వింటారు.































