Sai Pallavi : సాయి పల్లవి.. ‘హై బ్రీడ్ పిల్ల సింగల్ పీస్’ ఇది సినిమాలో డైలాగ్ అయినా నిజంగా కూడా సాయి పల్లవికి బాగా సూట్ అవుతుంది. అందరి హీరోయిన్ల దారి ఒకవైపు అయితే సాయి పల్లవిది ఇంకో దారి. కుర్ర హీరోయిన్లందరూ అందాల ఆరాబోతతో అవకాశాల కోసం ఎగబడుతుంటే సాయి పల్లవి మాత్రం ఎన్ని కోట్లిచ్చినా సినిమాలో పొట్టి బట్టలు వేసుకోనని, అలా నేను చేయలేనని చెప్పేస్తుంది. అంతేనా సినిమా ఎంత పెద్ద హీరోదైనా తనకు నచ్చకపోతే ఇక చేయనని మొహమాటం లేకుండా చెబుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలానే వైరల్ అవుతోంది సాయి పల్లవి.

సారీ చేయలేను.. ఇక సినిమాల్లో చేయను…
ఇటీవలే ఒక బడా పొలిటిషన్ కొడుకుతో పెళ్లి కోసం కోరి వచ్చి ఆ పొలిటిషన్ అడిగితే చాలా మర్యాదగా నో చెప్పిందంట. ఇక ఇపుడు మరో సారి ఇలాంటి న్యూస్ తో హాట్ టాపిక్ అయింది రౌడీ బేబీ. ఒక బడా డైరెక్టర్ లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం అడిగితే చేయనని చెప్పిందట అమ్మడు. దీనికి కారణం ఉంది. సాయి పల్లవి ఇటీవల నటించిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ డిజాస్టర్ లుగా మిగిలాయి. అందుకని ఇక ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకుందట.

నిర్మాతలకు నష్టాలు వస్తున్నందున సినిమాలు చేయకూడదని అనుకున్నట్లు చెప్పి ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి థాంక్యూ కానీ నేను ఇక సినిమాల్లో నటించాలని అనుకోవడం లేదని చెప్పిందట. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం.. సాయి పల్లవికి ఈ సినిమా కోసం ఆ డైరెక్టర్ రెండు కోట్లు ఆఫర్ చేసాడట. అంత ఆఫర్ చేసినా సాయి పల్లవి అస్సలు టెంప్ట్ అవ్వకుండా నో చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.































