Sai Pallavi : ప్రేమమ్ సినిమాతో తమిళ సినిమాలో తన కెరీర్ ని ప్రారంభించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమా ద్వారా అభిమానులకు పరిచయం అయ్యింది. తన డాన్స్ ఇంకా నటన తోనే కాకుండా తన సింప్లిసిటీతో అభిమానులకు మరింత చేరువ అయ్యింది. ఇక అంతేకాకుండా బోల్డ్ పాత్రలలో నటించను అని తెగేసి చెప్పడంతో తనకు ఫ్యాన్స్ మరింత పెరిగారు అనే చెప్పవచ్చు.

సాదారణంగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యేవారుంటారు… కానీ సాయి పల్లవి యాక్టర్ గా చేస్తూనే తన వైద్య విద్య ను పూర్తిచేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో గుర్తింపు పొందిన జార్జియాలోని బిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో 2016 లో తన ఎంబీబీఎస్ పట్టాను సాధించింది.
స్టేజ్ మీద అదిరిపోయే డాన్స్ చేసిన సాయి పల్లవి….
జార్జియాలో మెడిసిన్ చేసే సమయంలో సాయి పల్లవి యూనివర్సిటీకి సంబందించిన ఒక కార్యక్రమంలో తోటి విద్యార్ధితో కలసి స్టేజ్ మీద డాన్స్ చేసింది. సాయి పల్లవి ఫ్యాన్స్ ఎపుడు చూడని విధంగా స్టేజ్ మీద డాన్స్ ఇరగదీసింది. ఎప్పుడో జరిగిన దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో లో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.



































