టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కథా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకొని తనదైన శైలిలో దూసుకుపోతోంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సాయి పల్లవి,ఫహద్ ఫాజిల్ జంటగా నటించిన మలయాళ చిత్రం ‘అతిరన్’. 2019 లో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .
ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘అతిరన్’. ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మాధ్యమం లో సందడి చేయనుంది. మలయాళంలో ‘అతిరన్’పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్రముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఆహా ఈ సినిమాకి సంబంధించి నటువంటి టీజర్ విడుదల చేసింది.
ఈ టీజర్ లో సాయి పల్లవి పిచ్చిదానిగా మారిపోయి చేసిన నటన ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వివేక్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
ఇకపోతే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సందడి చేయనున్నారు. అదే విధంగా సాయి పల్లవి నాని “శ్యామ్ సింగ రాయ్ ” సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…