Sai Pallavi : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలలో బోనాల పండగ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో ఎంతో భక్తి శ్రద్దలతో బోనాలు జరుపుకుంటారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇపుడు ఆషాడమాసం కాబట్టి తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహించింది. ఈ బోనాల పండుగ సందర్బంగా సాయి పల్లవి ఫోటో ఒక్కటి నేటిజన్లను ఆకట్టుకుంటోంది.

బోనమెత్తిన సాయి పల్లవి…
తెలంగాణాలో బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహించడమే కాదు, దీనికి చాలా ప్రత్యేకత వుంది. దీని గురించి చాలా సినిమాలలో, పాటలలో ఇప్పటికే చూపించారు. అయితే తాజాగా రాణా, సాయి పల్లవి కలసి నటించిన ‘విరాట పర్వం’ సినిమా లో కూడా తెలంగాణ సంస్కృతి చక్కగా చూపించారు. ఇందులో భాగంగానే సాయి పల్లవి బోనం ఎత్తిన సీన్ చక్కగా చూపించారు. ఈ సన్నివేశాంలో సాంప్రదాయ దుస్తులు అయిన లంగా ఓని లో సాయి పల్లవి బోనం ఎత్తి అందరిని ఆకట్టుకుంది.

గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక!#Happybonam pic.twitter.com/wSVxr0yvJj
— v e n u u d u g u l a (@venuudugulafilm) July 24, 2022
ప్రస్తుతం బోనాలు జరుగుతుందటంతో దర్శకుడు వేణు సాయి పల్లవి బోనం ఎత్తిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. అంతేకాదు ఫోటోతో పాటు తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి పర్వావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ ఇది.. అంటూ ఈయన సాయి పల్లవి బోనం ఎత్తిన ఫోటోని షేర్ చేశారు.అందరికీ #Happybonam అనే హ్యాష్ట్యాగ్తో అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు డైరెక్టర్ వేణు ఊడుగుల. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























