Sai Sri Charan: బుల్లితెర పై వస్తున్న చాలా షోలలో సింగింగ్ కార్యక్రమాలకు కొదవ లేదు. ప్రధాన ఛానెల్స్ లో వస్తోన్న సింగింగ్ షోలలో పోటీతత్వం బాగా ఉంది. వాళ్ళ ఛానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఛానెల్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక ఈటీవీ రియాలిటీ షోలోలో ఎప్పుడు టాప్ ప్లేసులో లో ఉంటోంది. జబర్దస్త్, క్యాష్, ఢీ వంటి షోలో మంచి రేటింగ్ తో ఉన్నాయి. ఇక అలానే పాడుతాతీయగా బాలు గారు ఉన్నన్ని రోజులు సక్సెస్ ఫుల్ గ సాగి ఇపుడు తనయుడు ఎస్పీ చరణ్ నేత్రుత్వంలో వస్తోంది. ఇక అలానే జీ తెలుగులో కూడా సింగింగ్ ప్రోగ్రామ్ సరీగమప మంచి ఆదరణ తెచ్చుకుంది. ఇక మా టీవీ లో కూడా oఒక సింగింగ్ ప్రోగ్రమ వస్తోంది. ఇలా అన్ని ఛానెల్స్ లోనూ ఇలాంటి షోస్ వల్ల కంపిటిషన్ పెరిగి రేటింగ్స్ కోసమా కొత్తగా ఆలోచిస్తూనే ఉన్నారు.

శ్రీముఖి, సాయి శ్రీ చరణ్ లవ్ స్టోరీ…
ఇక ఈటీవీ జబర్దస్త్ లో రష్మీ, సుధీర్ లా మధ్య ఏదో ఉందంటూ లవ్ ట్రాక్ పెట్టి ఆడియన్స్ బాగా కనెక్ట్ చేసారు ఆ షోకి. వాళ్ళ మధ్య ఆ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయి షో కి అదనపు ఆకర్షణంగా ఉండేది. ఇక ఏ ఈవెంట్లలలో అయిన ఈ జంట సందడి వేరే. ఇక అలానే ఇపుడు జీ తెలుగులో వస్తున్న సరీగమప సింగింగ్ షో లో కూడా సింగర్ సాయి శ్రీ చరణ్, శ్రీముఖి మధ్య లవ్ ట్రాక్ పెట్టారు. షోలో ఇది ఒక అదనపు ఆకర్షణంగా నిలిచింది. ఇక పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న సరీగమప సింగర్ చరణ్ ఈ ఇష్యూ గురించి మాట్లాడారు. నిజంగా యాంకర్ శ్రీముఖి, మీ మధ్య ఏదైనా ఉందా అని అడుగగ అలాంటిదేమి లేదని అది కేవలం షో వరకు మాత్రమే అని శ్రీముఖి అందరితో చాలా చక్కగా ఉంటుందని చెప్పాడు. ఇక షోలో పాటపడేటపుడు వెనుక అలా లవ్ సింబల్ వేసి తన ఫోటో వేయడం అదంతా కూడా తనకు తెలియదని టెలికాస్ట్ అయినపుడు చూసుకుంటా అని చెప్పాడు.

శ్రీముఖి తో ఎలాంటి రిలేషన్ లేదని తను చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని అందరితోచాలా చక్కగా మాట్లాడుతుందని చెప్పాడు సాయి శ్రీ చరణ్ ఇక తనని బయట అందరూ గుర్తుపట్టి మాట్లాడించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అయితే ఎక్కువమంది శ్రీముఖి తో లవ్ ట్రాక్ గురించి అడుగుతున్నారని అపుడు ఒక్కోసారి అనుమానం వస్తుంటుంది వీళ్ళు నా పాట చూడరా అని కొంతమందిని అడిగాను కూడా అయితే మీ పాట చూస్తాము నచుతుంది, కానీ మాకు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదామీ ఇద్దరి ఫన్ షోలో బాగుంటుందని చెప్తారట. అయితే నిజంగానే షో లో ఫన్ కోసం క్రియేట్ చేసిందే కానీ నిజంగా శ్రీముఖి తో ఎలాంటి రిలేషన్ లేదని చరణ్ క్లారిటీ ఇచ్చేసాడు.



























