Salman Khan : ప్రముఖ సింగర్ సిద్దు ఇటీవల పంజాబ్‌లో దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యకు మేమే కారణం అని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించుకోవడం కూడా జరిగింది. కాకపోతే దీనితో ఆగకుండా సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు. సల్మాన్ ఖాన్ తండ్రి వాకింగ్ వెళ్లిన సమయంలో బెదిరింపు లేఖలు కూడా అందేలా చేశారు. సింగర్ సిద్దూని చంపినట్టు చంపుతాం అంటూ లేఖలో ఉండటంతో చర్చనీయంశంగా మారింది. గతంలో కూడా సల్మాన్ ను కృష్ణ జింకల కేసు దర్యాప్తు సమయంలో కృష్ణ జింకలని దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించడం జరిగింది.

బెదిరింపు లేకతో అప్రమత్తమైన సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బందోబస్తుని అధికం చేసారు. ఈ క్రమంలోనే ఆయనపై అపుడే మర్డర్ అటెంట్ కూడా జరిగిందని తెలుస్తుండటం అందరికీ షాకింగ్‌గా మారింది. సల్మాన్ ఖాన్‌పై మర్డర్ అటెంట్ కూడా జరిగిందంటూ జాతీయ మీడియాలో కథనాలు కుడా వచ్చాయి.
చివరి క్షణంలో వెనక్కి తగ్గిన షూటర్…..
సల్మాన్ ను బెదిరించిన లారెన్స్ బిష్ణోయ్ పంపిన షార్ప్‌షూటర్ సల్మాన్ నివాసం బయట కాపుకాస్తూ, సల్మాన్ ఓ ప్రైవేట్ ఫంక్షన్‌కి వెళుతున్నప్పుడు ఓ పదునైన ఆయుధంతో హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో పోలీసుల భద్రత ఎక్కువగా ఉండటంతో చివరి క్షణంలో పట్టుబడతామనే భయంతో ఆ షార్ప్ షూటర్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. తనకు వస్తున్న బెదిరింపులపై స్పందించిన సల్మాన్.. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, కానీ సిద్ధూ కేసులో విచారిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించి తనకు తెలుసని సల్మాన్ పేర్కొన్నారు.

తాజాగా షూటింగ్ లో వున్న కబీ ఈద్ కబీ దివాలి సినిమాతో సల్మాన్ బిజీ గా వున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం హై సెక్యూరిటీతో సల్మాన్ ఖాన్ హైదరాబాద్ కు వచ్చారు.

































