Samantha : తెలుగు, తమిళంలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సమంత. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో అలరించి పెళ్లయ్యాక మాత్రం అచితూచి సినిమాలు చేస్తోంది. పాత్రకు ప్రాధాన్యమున్న వాటిని ఎంచుకుంటోంది. ఇక ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ లో రాజీ అనే పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ లేడీ ఒరింటెడ్ సినిమాలు శాకుంతలం, యశోద తో బిజీ గా ఉన్న సామ్ తన మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో నటిస్తోంది .

చైతు కోసం షారుఖ్ ని కాదనుకుందట…..
ఇక ఇప్పుడొక ఆసక్తికర విషయం సమంత గురించి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్ గా మొదట సమంతను అనుకున్నాడట డైరెక్టర్ అట్లీ. 2019 లో స్క్రిప్ట్ పనులు చేస్తునప్పుడే సామ్ ను సంప్రదించి అడిగాడట కానీ సమంత నాగచైతన్యతో కలిసి సమయం గడపాలని, కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాలనుకోవడంతో సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించిందట.
It’s a special RC project that has seen its wait because of inevitable issues surrounding us.But a few good men worked hard & made it happen. Want to thank @_GauravVerma the Co-Producer, @Atlee_dir and their Jawans for making this dream come to life. Now… Good to go Chief…! pic.twitter.com/7lhfMiE6hD
— Shah Rukh Khan (@iamsrk) June 4, 2022
ఇక ఇపుడు ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయన తార పేరు వినిపిస్తోంది. పాపం సామ్ చైతూ కోసం ఇంత మంచి ఆఫర్ వదులుకున్న ప్రస్తుతం చైతన్య కూడా తనతో లేడు కదా, ఈ ఆఫర్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఉండాల్సిందని సమంత అభిమానులు బాధపడుతున్నారు. ఏదేమైనా అమ్మడి టైం బాగోలేనపుడు ఏం చేయలేం మరి.

































