Samantha : నిత్యం ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే హీరోయిన్స్ లో సమంత ముందుంటుంది. నాగచైతన్య సమంత విడాకుల తరువాత సమంత గురించి ఏ చిన్న వార్తయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ట్రోల్స్ గురించి చెప్పక్కర్లేదు. విడాకుల తరువాత సామ్ ఏ చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టినా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ లో మాట్లాడినా తనపై పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వస్తాయో అలానే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి వాటిని సమంత పెద్దగా పట్టించుకోదు.

బయటి ప్రపంచానికి దూరంగా సమంత…
పాన్ ఇండియా ప్రాజెక్టులు, అటు బాలీవుడ్ ఎంట్రీ తో బిజీగా ఉన్న సమంత కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైంది. అసలు బయట కనిపించడం లేదు. ఫోటో షూట్లు, ఇంటర్వ్యూ లు అంటూ ఉండే సమంత కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. ఇక దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధిచిన వార్తలు షికార్లు చేస్తున్నాయి. సమంతకు ఆరోగ్యం బాగోలేదని, చర్మానికి సంబంధిచిన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది అంటూ కథనాలు అల్లేశారు. ఇక వీటిపై సామ్ మేనేజర్ స్పందిచారు.

ఈ నెలాఖరున మళ్ళీ షూటింగ్స్ లో సమంత పాల్గొనబోతోంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక సమంత పై అనారోగ్య సమస్యలు అంటూ విషయం తెలియకుండా వార్తలు రాసిన వెబ్ సైట్ల మీద చర్యలు తీసుకోడానికి సమంత ఆలోచిస్తున్నట్లు కూడా మేనేజర్ వివరించారు. మొత్తానికి కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రిలాక్స్ మోడ్ లో ఉన్నట్టుంది. ఇక సమంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యశోదర, శకుంతలం, ఇక విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఖుషి లైన్ లో ఉన్నాయి.



































