టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన సమంతా.. కొన్నాళ్ళకు అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించడం మానలేదు ఈ ముద్దుగుమ్మ.. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం అనేది పక్కన పెడితే.. ముఖ్యంగా పెళ్లి తరువాత కూడా ఎక్స్ పోజింగ్ కి ఎలాంటి అడ్డు హదుపు లేకుండా హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది. అయితే ఈ క్రమంలో ఆమె పై పలు విమర్శలు వచ్చాయి. దాంతో కొన్నాళ్ళూ గ్లామర్ ఫోటోషూట్ లకు దూరంగా ఉంది సమంత. గతేడాది లాక్డౌన్ టైంలో ఆమె ‘అర్బన్ ఫార్మింగ్’, ‘యోగ’ వంటి ఫోటోలను మాత్రమే షేర్ చేసింది తప్ప.. ఆ తరువాత ఎక్కడా హాట్ ఫోటోలను షేర్ చేయలేదు.

ఐతే, ఇప్పుడు మళ్ళీ సినిమాల వేగం పెంచింది కాబట్టి.. ఆమె మళ్ళీ గ్లామర్ ఫోటోషూట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ నిండా అప్డేట్ చేస్తూ ముందుకు పోతుంది. ఇప్పటికే అక్కినేని అభిమానులు సమంత గ్లామర్ చూసి నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. సమంత తన భర్త చైతన్యతో కలిసి ఎక్కువగా బ్రాండ్స్ ఒప్పుకుంటోంది. ఆ యాడ్స్ లో నటిస్తోంది. దాంతో ఆ యాడ్స్ కోసం ఆమె గ్లామర్ షూట్స్ చెయ్యక తప్పడం లేదు. పైగా చైతు కూడా గ్లామర్ యాడ్స్ కి అంగీకారం తెలపడంతో.. మొత్తానికి సమంత ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అన్నిటికి మించి సమంతకి ఫోటోషూట్స్ అంటే మక్కువ ఎక్కువ.

నిజానికి ఇన్ స్టాగ్రామ్ వేదిక పై ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేసి ఆమె మిలియన్ల కొద్దీ ఫాలోవర్లుని సంపాదించుకోగలిగింది.కాగా ప్రస్తుతం సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ లో కరోనా కలకలం రేగిన మాట వాస్తవం. ఏకంగా దర్శకుడు గుణశేఖర్ కే కరోనా పాజిటివ్ అని తేలడం… ఆ తరువాత నెగిటివ్ అని తేలడం.. ఇలా మధ్యలో షూటింగ్ ఆపేసినా.. మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. ఇక గుణశేఖర్ డైరెక్షన్లో ప్రస్తుతం సమంత మెయిన్ లీడ్ గా చేస్తోన్న శాకూంతలం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here