Samantha: సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియోలో భాగంగా సమంత ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన ఇబ్బందులను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ శకుంతల పాత్రలో నటించడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు.ముఖ్యంగా తనకు పువ్వులు అంటే చాలా అలర్జీ అని తెలిపారు. కానీ శకుంతల పాత్రలో నటించడం కోసం తాను చేతికి మెడ చుట్టూ కూడా పువ్వులు పెట్టుకోవాల్సి వచ్చింది.
ఇలా పువ్వులు చుట్టుకోవడంతో అలర్జీ కారణంగా తన శరీరం మొత్తం దద్దుర్లు వచ్చాయని అలాగే ఆ పువ్వుల గుర్తులు తన శరీరంపై టాటూలుగా పడి దాదాపు 6 నెలల వరకు తనకు ఇబ్బంది పెట్టాయని సమంత తెలిపారు. షూటింగ్ సమయంలో ఆ గుర్తులు కనిపించకుండా మేకప్ తో కవర్ చేసామని సమంత తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ కుందేలు కూడా తనని కరిచిందని సమంత తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో ఒక పాట కోసం తాను ధరించిన లెహంగా ఏకంగా 30 కేజీలు ఉందని ఆ బరువు మోయడానికి ఇబ్బంది పడ్డానని సమంత తెలిపారు. అయితే ఈ లెహంగా ధరించి చుట్టూ తిరుగుతున్న సమయంలో తాను ప్రేమ్ నుంచి బయటకు వెళ్ళగా కెమెరామెన్ తనపై అరిచారని ఆ సమయంలో నేను వెళ్లలేదు… లెహంగా నన్ను పక్కకు లాక్కెళ్ళిందని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారని ఈ సందర్భంగా సమంత ఈ సినిమా విశేషాలను తెలియజేశారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…