Samantha: సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.
ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు మీడియా ప్రతినిధి నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఒకప్పుడు ఎంతో అమాయకంగా ఉండే సమంత ఇంత ధైర్యవంతురాలుగా ఎలా మారిందని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ…ఒకప్పుడు తనకు ఏ విధమైనటువంటి కష్టాలు లేవు చాలా హ్యాపీగా ఉండేదాన్ని అందుకే తెరపై కూడా అలాగే కనిపించేదాన్ని.
ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు పూర్తిగా మారిపోయాయి. నా ప్రయాణంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను అయితే ఆ సమస్యల నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని అందుకే ఇంత ధైర్యవంతురాలుగా మారిపోయానని సమంత తెలిపారు. ఈ ప్రయాణంలో సమస్యలతో పోరాడటం కూడా తనకు అలవాటైపోయింది అంటూ సమంత ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ రాజీ లాంటి పాత్ర చేసిన తర్వాత శకుంతల పాత్రలో నటించాలి అంటే ముందుగా భయం వేసిందని అందుకే మొదట్లో ఈ సినిమాకి నో చెప్పిన తిరిగి ఈ సినిమాకు ఒప్పుకున్నానని సమంత ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…