Samantha-Allu Arjun: బన్నీ వల్లనే సమంత హ్యాపీ..! ఎందుకంటే..!
Samantha-Allu Arjun: నాగ చైతన్యతో విడాకులత వల్ల కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం వరస పెట్టి సినిమాలను చేస్తోంది. అయితే చాలా కాలం గ్యాప్ తరువాత పుష్ఫ సినిమాలో చేసిన ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా..’’ పాట రికార్డులు క్రియేట్ చేసింది.
దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్, ఇంద్రావతి చౌహాన్ గాత్రం, సమంత స్టెప్పులు ఈ ఐటెం నెంబర్ ను పెద్ద హిట్ చేశాయి. యూట్యూబ్ లో మిలిమన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి.
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటిది సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కు ఒప్పుకుంది. అయితే ఇదంతా అల్లు అర్జున్ వల్లే చేశానని చెప్పుకొచ్చింది సమంత. ఐటెం సాంగ్ చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నప్పుడు.. అల్లు అర్జునే సాంగ్ గురించి వివరించాడని.. నన్ను నమ్ము అనే భరోసాని ఇచ్చాడని సమంత చెప్పుకొచ్చింది.
ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఊ అంటావా.. చేయడానికి అంగీకరించను` అని సమంత తెలిపింది. ఇన్నాళ్లు ఈ ఐటెం సాంగ్ చేయాడానికి డైరెక్టర్ సుకుమార్ కారణం అని అనుకున్నాం. సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ ఒప్పించడం వల్లే సమంత ‘ఊ అంటవా’ ఐటెం సాంగ్ చేసిందని తెలిసింది.
ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం సమంత నార్మల్ అయిపోయింది. ప్రస్తుతం వరసగా సినిమాలపై కాన్సన్ ట్రేట్ చేస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ పెద్ద హిట్ కావడంతో వరసగా సినిమాలకు కమిట్ అవుతోంది. ఇప్పటికే గుణ శేఖర్ డైరెక్షన్ ఓ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో యశోద సినిమాను చేయడంతో పాటు ఫ్యామిలీ మ్యాన్ 2 డెరెక్టర్స్ రాజ్ అండ్ డీకేతో మరో వెబ్ సిరీస్ కు కమిట్ అయింది సమంత.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…